Telangana Politics: తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది..? అప్పుడే మొదలైన పవర్ పాలిటిక్స్..

తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అధికారంలోకి వచ్చేది ఎవరు? నేతలు మాత్రం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు. మళ్లీ సీఎం అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే.. కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరమని గులాబీ పార్టీ అంటోంది. పవర్ గేమ్‌లో రెండు పార్టీల డైలాగ్ వార్ హాట్‌ టాపిక్‌గా మారింది.

Telangana Politics: తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది..? అప్పుడే మొదలైన పవర్ పాలిటిక్స్..
KCR Revanth Reddy

Updated on: Apr 21, 2025 | 8:42 AM

తెలంగాణలో మళ్లీ గెలిచే పార్టీ ఏది? అధికారంలోకి వచ్చేది ఎవరు? నేతలు మాత్రం ఇప్పటి నుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు. మళ్లీ సీఎం అయ్యేది తానే అని రేవంత్ అంటుంటే.. కేసీఆర్ సీఎం కావడం చారిత్రక అవసరమని గులాబీ పార్టీ అంటోంది. పవర్ గేమ్‌లో రెండు పార్టీల డైలాగ్ వార్ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించతలపెట్టిన సభను విజయవంతం చేసేందుకు భారీ కసరత్తు చేస్తోంది గులాబీ పార్టీ. ఈ క్రమంలో శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు ఆ పార్టీ అగ్రనేతలు. పార్టీకి మళ్లీ పాత ఊపు తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నేతలతో తెలంగాణ భవన్‌లో సమావేశమైన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల, రాజేంద్రనగర్‌లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయడంలో విఫలమైందన్నారు. అభివృద్ధి చేయకపోగా.. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఆనవాళ్లను చెరిపేయాలని చూస్తోందన్నారు. అందుకే మరోసారి కేసీఆర్ రావడం చారిత్రక అవసరమని అంటున్నారు.

తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాలంటున్నారు కేటీఆర్. అయితే తాము వచ్చింది ఐదేళ్ల కోసం కాదు, పదేళ్ల కోసమని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మార్చి 30న సొంత నియోజకవర్గంలో పర్యటించిన సీఎం.. పదేళ్ల పాటు సీఎం సీట్లో ఉండేది తానేనని ప్రకటించారు.

తెలంగాణలో ఎన్నికలకు మరో మూడేన్నరేళ్ల సమయం ఉంది, నేతలు మాత్రం ఇప్పటి నుంచి రేపటి కోసం కాలు దువ్వుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..