Telangana: ఇక ఇంట్లోనే కూరగాయలు పండించుకోండి.. ప్రభుత్వ ఫ్రీ ట్రైనింగ్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

| Edited By: Anil kumar poka

Oct 26, 2022 | 2:46 PM

ప్రస్తుత కాలంలో మంచి నీళ్లు మొదలు.. తినే ప్రతీ ఆహారం కలుషితమే అవుతోంది. వ్యాపార దృష్టి కోణంలో డబ్బు సంపాదనపై అత్యాశతో అన్నింటినీ కల్తీ చేస్తున్నారు.

Telangana: ఇక ఇంట్లోనే కూరగాయలు పండించుకోండి.. ప్రభుత్వ ఫ్రీ ట్రైనింగ్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Terrace Garden
Follow us on

ప్రస్తుత కాలంలో మంచి నీళ్లు మొదలు.. తినే ప్రతీ ఆహారం కలుషితమే అవుతోంది. వ్యాపార దృష్టి కోణంలో డబ్బు సంపాదనపై అత్యాశతో అన్నింటినీ కల్తీ చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయంలో, పంటలకు పురుగుల మందులు వినియోగం అధికంగా ఉండటం కూడా పెద్ద సమస్యగా మారింది. అటు కల్తీ, ఇటు పరుగుల మందు ఆహారం తిని ప్రజలు తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నారు. అందుకే ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఒక అవగాహన వస్తోంది. సేంద్రీయ వ్యవసాయంపై, సేంద్రీయ ఆహార ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. పల్లెటూర్లలో అయితే ప్రజలు తమ తమ ఇళ్లలోనే కూరగాయలను పండించుకుంటున్నారు. కొందరు అవగాహన లేకపోయినా తెలిసినంత వరకు ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొందరు ఎలా పండించాలో తెలియక బయట మార్కెట్‌లో కొనుగోలు చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యానవన శాఖ కీలక ప్రకటన చేసింది. ఇంట్లోని బాల్కానీ, మేడపై కూరగాయల సాగు చేసేందుకు ప్రోత్సాహం అందిస్తోంది. ఇందులో భాగంగా మేడలు, బాల్కనీలో కూరగాయల సాగు చేయడంపై ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. ఇంట్లోనూ కూరగాయలు పండించుకోవాలనుకునే వారికి ఇది నిజంగా సువర్ణవకాశం అని చెప్పొచ్చు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లలోని బాల్కానీలో కూరగాయల సాగు చేయాలనుకునే వారికి ఉచితంగా శిక్షణ అందిస్తామని, ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చునని తెలంగాణ ఉద్యానవనశాఖ ప్రకటించింది. ప్రతి నెల 4వ ఆదివారం దీనికి సంబంధించిన శిక్షణ ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరికైనా ఆసక్తి ఉంటే.. తెలంగాణ ఉద్యానవన శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..