Big News Big Debate: బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య నువ్వా- నేనా అన్నట్టుగా ఆపరేషన్ ఆకర్ష్
బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య ఆపరేషన్ ఆకర్ష్ నువ్వా- నేనా అన్నట్టుగా సాగుతోంది. నిన్నమొన్నటి దాకా మండల, గ్రామస్థాయి నాయకులతో వలసలతో నియోజకవర్గానికి పరిమితం అయింది. కానీ ఇది స్టేట్ పాలిటిక్స్‌కు కూడా పాకింది.
మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు నడుస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌తో బైపోల్ హీట్ మరింత పెరిగింది. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరతారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మునుగోడు పరిధిలో చోటా మోటా నేతలు కండువాలు మార్చేస్తుంటే రాష్ట్ర స్థాయిలోనూ కీలక నేతలు రాత్రికి రాత్రే జెండాలు మారుస్తున్నారు. ముందురోజు నామినేషన్‌లో పాల్గొన్న బూర నర్సయ్యగౌడ్ తెల్లారేసరికి బీజేపీకి దగ్గరయ్యారు… ఇక బీజేపీలో ఉన్న స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌లు అనూహ్యంగా టీఆర్ఎస్ గూటికి చేరారు. ఇంకా మరికొన్ని పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఎవరికి వారు బీసీలకు ఆత్మగౌరవం లేదంటూ పార్టీ వీడటం ఇక్కడ ఆసక్తికరంగా మారింది.
Published on: Oct 21, 2022 07:14 PM
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

