Telangana: ప్రేమ పేరుతో యువకుడిని ట్రాప్‌ చేసిన కిలాడీ లేడీ.. అక్కడికి పిలిచి స్పాట్‌ పెట్టేసింది.. చివరకు..

ప్రేమ పేరుతో ట్రాప్‌ చేసి ఓ యువకుడిని కిడ్నాప్‌ చేయించింది ఓ యువతి. అయితే, కిడ్నాపర్లను పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన నిర్మల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కలకలం రేపింది.

Telangana: ప్రేమ పేరుతో యువకుడిని ట్రాప్‌ చేసిన కిలాడీ లేడీ.. అక్కడికి పిలిచి స్పాట్‌ పెట్టేసింది.. చివరకు..
Telangana Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 20, 2022 | 9:59 AM

ప్రేమ పేరుతో ట్రాప్‌ చేసి ఓ యువకుడిని కిడ్నాప్‌ చేయించింది ఓ యువతి. అయితే, కిడ్నాపర్లను పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన నిర్మల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కలకలం రేపింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన ఆర్‌ఎంపీ రవిని మహారాష్ట్రకు చెందిన ఓ యువతి ప్రేమ పేరుతో ట్రాప్‌ చేసింది. రోజూ మాట్లాడుతూ.. అతన్ని నమ్మించింది. ఈ క్రమంలోనే నాందేడ్‌ రావాలని పిలవడంతో రవి అక్కడికి వెళ్లాడు. దీంతో ఆ కిలాడీ లేడి కిడ్నాప్‌ చేయించి డబ్బు డిమాండ్‌ చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం రేపింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన రవి ఆర్‌ఎంపీగా పని చేస్తున్నాడు. ఈ సమయంలో ఫొన్‌లో ఓ యువతితో పరిచయం ఎర్పడింది.

ఈ క్రమంలో మహరాష్ట్ర నాందేడ్‌కు రావాలంటూ ప్రియురాలు ఫోన్ చేయడంతో ఆర్ఎంపి‌ రవి అక్కడికి చేరుకున్నాడు. ముందస్తు ఫ్లాన్ ప్రకారం.. కిలాడీ లేడి ఇద్దరి వ్యక్తులతో రవిని కిడ్నాప్ చేయించింది. అనంతరం ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. డబ్బు కోసం ఆర్ఎంపి రవిని‌ బంధించి బైక్ పై తీసుకెళుతుండగా నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం వంజర్ గ్రామంలో స్థానికులు వారిని ఆపారు. అనుమానం కలగడంతో వారిని తనిఖీ చేశారు. కిడ్నాపర్ల వద్ద రివాల్వర్, రెండు బుల్లెట్లు ఉన్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటన మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో గస్తీ‌కాస్తున్న సమయంలో కిడ్నాపర్లు పట్టుబడ్డారని.. వారిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..