Tiger Attack: కొమురంభీం జిల్లా సరిహద్దుల్లో పెద్దపులి పంజా.. ఇద్దరు పశువుల కాపరుల మృత్యువాత

కొమురం భీం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం వేంపల్లి అటవి ప్రాంతంలో పశువుల మందపై పులి దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఇదే సమయంలో పెంచికల్ పేట మండలం అగర్ గూడలో లేగ దూడపై దాడి చేసింది పులి.

Tiger Attack: కొమురంభీం జిల్లా సరిహద్దుల్లో పెద్దపులి పంజా.. ఇద్దరు పశువుల కాపరుల మృత్యువాత
Tiger Attack
Follow us
Basha Shek

|

Updated on: Oct 20, 2022 | 10:08 AM

కొమురంభీం జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో ఓ పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పశువుల కాపరులు మృతి చెందారు. ముల్ తాలుకా చించాడా గ్రామానికి చెందిన నానాజీ నీకేసర్ , దివరూ పసలేకర్ అనే ఇద్దరు పశువుల కాపర్లపై దాడి చేసింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అటు కొమురం భీం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం వేంపల్లి అటవి ప్రాంతంలో పశువుల మందపై పులి దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఇదే సమయంలో పెంచికల్ పేట మండలం అగర్ గూడలో లేగ దూడపై దాడి చేసింది పులి. ఈ దాడిలో దుర్గం ఆశన్న అనే వ్యక్తికి చెందిన లేగదూడ మృతి చెందింది. ఒకే రోజు మూడు వేరు వేరు చోట్ల పులి దాడి చేయడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

కాగా గత కొన్ని రోజులుగా కొమురంభీం జిల్లా సరిహద్దుల్లో పులుల సంచారం ఎక్కువగా ఉంది. జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర నవేగాంలో పంట పొలంలో రైతుపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటనలో మడావి గోవింద అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. కొద్ది రోజుల క్రితం వాసుదేవ్ అనే రైతుపై దాడి చేసి పులి హతమార్చింది. ఈ వరుస ఘటనలతో రైతులకు పోలాలకు వెళ్లాలన్నా.. అడవులకు వెళ్లడానికి భయపడిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ  వార్తల కోసం క్లిక్ చేయండి..