యూపీఎస్సీ నిర్వహించే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీస్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. అఖిల భారత సర్వీసుల్లో కొలువులు సొంతం చేసుకోవడానికి ఏటా లక్షలాది మంది పోటీపడుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్ధులకు ఆశ ఉన్న స్తోమతలేక వెనుకబడిపోతున్నారు. సరైన శిక్షణ, అందుబాటులో పుస్తకాలు, మెటీరియల్ లేకపోవడం వల్ల తమ ఆశలను గొంతులోనే నొక్కేసుకుంటున్నారు. ఇటువంటి వారి పాలిట వరంలా తెలంగాణ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది.
రాజేంద్రనగర్‌లోని ఎస్టీ స్డడీ సర్కిల్‌లో రెసిడెన్షియల్ విధానంలో సివిల్ సర్వీసెస్ శిక్షణ-2023 కోసం ప్రవేశానికి జూన్ 9 నుంచి జులై 7 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టీనా ఓ ప్రకటనలో తెలిపారు. కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. సివిల్స్‌లో తొలి దశ అయిన సీశాట్-2024 పరీక్ష రాసేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా తెలంగాణ ఎస్టీ స్టడీసర్కిల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.