TS 10th Supply Hall Tickets 2023: జూన్ 14 నుంచి పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ- జూన్ 2023 పరీక్షలు జూన్ 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు..
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ- జూన్ 2023 పరీక్షలు జూన్ 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు జూన్ 8న ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి హాల్ టికెట్లు పొందాలని సూచించారు.
కాగా ఈ ఏడాది పదో తరగతి పబ్లిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులకు జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఆయా పరీక్ష తేదీలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అంటే ప్రతి రోజూ 3 గంటల 30 నిముషాల వ్యవధిలో పరీక్షలు రాయవల్సి ఉంటుంది. టెన్త్ అకడమిక్ ప్రోగ్రాం (SSC), ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (OSSC) కోర్సులోని అన్ని సబ్జెక్టులకు ఆబ్జెక్టివ్ పేపర్ (పార్ట్ B) చివరి అరగంటలో మాత్రమే సమాధానం రాయవల్సి ఉంటుంది.
తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ టైం టేబుల్-2023 ఇదే..
- జూన్ 14: ఫస్ట్ ల్యాంగ్వేజ్ (గ్రూప్-A), ఫస్ట్ ల్యాంగ్వేజ్ (పార్ట్-1 కంపోజిట్ కోర్సు), ఫస్ట్ ల్యాంగ్వేజ్ (పార్ట్-2 కంపోజిట్ కోర్సు)
- జూన్ 15: సెకండ్ ల్యాంగ్వేజ్
- జూన్ 16: థర్డ్ ల్యాంగ్వేజ్ (ఇంగ్లిష్)
- జూన్ 17: మ్యాథమెటిక్స్
- జూన్ 19: సైన్స్
- జూన్ 20: సోషల్ స్టడీస్
- జూన్ 21: OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్)
- జూన్ 22: OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్)
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.