అది గుడిపార్టీ.. ఇది బడిపార్టీ, చందాలు అయోధ్యకోసం కాదు, ఇక్కడి భద్రాద్రికి వసూలు చేయండి : పిడమర్తి రవి

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రంలో చందాలు అడగడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్త రవి..

అది గుడిపార్టీ.. ఇది బడిపార్టీ, చందాలు అయోధ్యకోసం కాదు, ఇక్కడి భద్రాద్రికి వసూలు చేయండి : పిడమర్తి రవి
Follow us
Venkata Narayana

| Edited By: Ravi Kiran

Updated on: Jan 29, 2021 | 1:10 PM

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రంలో చందాలు అడగడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్త రవి మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజానికి రామభక్తులకు రాముడిపై అభిమానం ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి భద్రాద్రి రామున్ని అభివృద్ది చేయాలని ఆయన అన్నారు. అయోధ్య రామమందిరం – బాబ్రీ మసీదు పరిష్కారం తరువాత కేంద్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించింది.. ఇప్పుడేమో డబ్బులు లేవని చందాలు అడుగుతున్నారని ఆయన అన్నారు. దక్షిణ అయోధ్య భద్రాద్రి అభివృద్ది చేసుకోకుండా ఎక్కడో ఉన్న దేవాలయాన్ని కట్టడం ఉత్తరాది రాజకీయ కుట్ర అని ఆయన అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు ఉత్తరాది పార్టీలేనన్న ఆయన, రామాలయం పేరుతో చందాలు బంద్ చేసి బడుల నిర్మాణాలకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఫిబ్రవరి ఒకటి నుండి బడి కోసం చందాల పేరుతో యాత్ర చేపడుతా.. ఆ నిధులన్నింటిని రాష్ట్ర సర్కార్ కు అందిస్తానని పిడమర్తి చెప్పుకొచ్చారు. ‘మోడీది గుడి పార్టీ.. కేసీఆర్ గారిది బడి పార్టీ’ అని ఆయన వ్యాఖ్యానించారు.