Double Bedroom Houses: అన‌ర్హుల‌కు డ‌బుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు… స్పీక‌ర్ పోచారం…

అనర్హులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కేటాయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఆ ఇండ్లను నిరుపేదలకు అందిస్తామని అసెంబ్లీ స్పీకర్‌...

Double Bedroom Houses: అన‌ర్హుల‌కు డ‌బుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు... స్పీక‌ర్ పోచారం...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 27, 2021 | 5:53 PM

అనర్హులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కేటాయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఆ ఇండ్లను నిరుపేదలకు అందిస్తామని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలోని బీర్కూర్‌ మండలం బరంగేడ్గి గ్రామంలో నిర్మించిన 50 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోచారం మాట్లాడుతూ..రాష్ట్రంలోని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అర్హులందరికీ ఇండ్లను నిర్మించి తీరుతామని అన్నారు.