AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Ticket to Cock: దానికీ ప్రాణముందిగా.. టిక్కెట్ కొట్టాల్సిందేనన్న కండక్టర్.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!

Bus Ticket to Cock: మనం అప్పుడప్పుడూ కొన్ని వింత సంఘటనలు చూస్తుంటాం. అవి చూడ్డానికి ఆశ్చర్యంగాను, వింతగానూ అనిపిస్తాయి.

Bus Ticket to Cock: దానికీ ప్రాణముందిగా.. టిక్కెట్ కొట్టాల్సిందేనన్న కండక్టర్.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!
Shiva Prajapati
|

Updated on: Feb 08, 2022 | 9:33 PM

Share

Bus Ticket to Cock: మనం అప్పుడప్పుడూ కొన్ని వింత సంఘటనలు చూస్తుంటాం. అవి చూడ్డానికి ఆశ్చర్యంగాను, వింతగానూ అనిపిస్తాయి. తాజగా బస్సు ఎక్కిన పాసెంజర్‌కి ఓ వింత అనుభవం ఎదురైంది. కండక్టర్‌ చెప్పిన మాట విని అతను షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే… ఓ వ్యక్తి తన పెంపుడు కోడి పుంజును తీసుకొని బస్సుఎక్కాడు. కండక్టర్‌ని తనకో టికెట్‌ ఇవ్వమని అడిగాడు. అయితే ఆ కండక్టర్‌ ఆ వ్యక్తి చంకలో ఉన్న కోడి పుంజును చూసి దానికి కూడా టికెట్‌ తీసుకోవాలని కోరాడు. అది కూడా లగేజీ టిక్కెట్ కాదు.. ప్రయాణ టిక్కెట్ తీసుకోమన్నాడట. కోడి పుంజుకు టికెట్‌ ఏంటని అడిగితే.. ఎందుకేంటి? దానికీ ప్రాణం ఉందికదా అన్నాడట కండక్టర్. కోడిపుంజుకి కూడా 30 రూపాయల టిక్కెట్ కొట్టినట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. కోడిపుంజుకి బస్ టిక్కెట్ పేరుతో ఓ టిక్కెట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఈ విషయాన్ని ఓ ప్రయాణికుడు టికెట్ ఫొటోతో ఉన్న వార్తను ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్యాగ్ చేశారు. ఆర్టీసీలో ఇలాంటి రూల్ ఉందా అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయాన్ని పరిశీలిస్తామని బదులిచ్చారు. గతంలోనూ ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో జరిగింది. అక్కడ కోడి పిల్లకు టికెట్ కొట్టిన ఘటన గతంలో వైరల్ అయింది. పది రూపాయలు పెట్టి కొన్న కోడిపిల్లకు ఆర్టీసీ కండెక్టర్ 50 రూపాయల టికెట్ కొట్టారు. దీంతో ఆ ప్రయాణికుడు అవాక్కయ్యాడు. అప్పట్లో ఈ వార్త వైరల్ అయింది. కోడి పిల్లకు టికెట్ ఏంటీ అని నెటిజన్లు కామెంట్స్ కూడా పెట్టారు.

Also read:

Andhra Pradesh: ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.. బహుమతులు గెలుచుకోండి.. పోలీసుల వినూత్న ఆఫర్..

Bank Jobs 2022: బ్యాంక్‌ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? నైనిటాల్ బ్యాంక్‌లో100 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. వెంటనే..

Nandita Swetha: ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు.. నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్