ఇంటి నిర్మాణం పనిని చూసేందుకు వచ్చిన కొడుకు.. అంతలోనే విషాదం..!
తండ్రి వెంట జరుగుతున్న పని చూడడానికి సంతోషంగా వచ్చిన విద్యార్థి అక్కడ జరిగిన ప్రమాదంలో కానరాని లోకానికి వెళ్లిపోయాడు. ఇంటిదగ్గర ఉన్న కొడుకును తన వెంట తీసుకువచ్చి..
తండ్రి వెంట జరుగుతున్న పని చూడడానికి సంతోషంగా వచ్చిన విద్యార్థి అక్కడ జరిగిన ప్రమాదంలో కానరాని లోకానికి వెళ్లిపోయాడు. ఇంటిదగ్గర ఉన్న కొడుకును తన వెంట తీసుకువచ్చి అతనికి చావుకు కారణమయ్యానని తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. ఎంతో సంతోషంగా తండ్రి వెంబడి వెళ్ళిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాకలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా స్లాబ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విజయ్ కుమార్(17) అనే ఇంటర్ చదువుతున్న విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు.
అయితే సెంట్రింగ్ విప్పుతుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలింది. ఆ ప్రదేశంలో సెంట్రింగ్ చేస్తున్న వ్యక్తులు తప్పించుకోగా, యువకుడు మాత్రం అందులో ఇరుక్కుపోయి మృతి చెందాడు. నర్సింగ్‌రావు అనే వ్యక్తి సెంట్రింగ్ పనులు కాంట్రాక్ట్ తీసుకొని సెంట్రింగ్ విప్పుతున్నారు. అయితే సెంట్రింగ్ కాంట్రాక్టర్ తన కొడుకు విజయ్ కుమార్‌ను వెంట పెట్టుకొని ఇంటి నిర్మాణం వద్దకు వచ్చాడు. వర్కర్లతో సెంట్రింగ్ విప్పుతుండగా కుమారుడు అక్కడే ఉండి చూస్తున్నాడు. అంతే ఒక్కసారి స్లాబ్ విద్యార్థిపై పడడంతో తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికి అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సెంట్రింగ్ వర్కర్లు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఇవి కూడా చదవండి: