Hyderabad: మేడారం జాతరకు 4,479 బస్సులు రైయ్..రైయ్..! బస్సుల కొరతతో నగరవాసుల అవస్థలు!

రెండేళ్లకోసారి మాఘమాసంలో నాలుగురోజుల పాటు నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తెలంగాణ వాసులకు ప్రత్యేకం. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఈ జాతర జరుగుతుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా కోటిమందికి పైగా భక్తులు తరలివస్తారు. కుంభమేళా తర్వాత అదే స్థాయిలో జరిగే అతిపెద్ద జాతర ఇది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనున్న ఈ జాతరకు వచ్చే భక్తులు మొదట ఊరి పొలిమేరలోని జంపన్నవాగులో..

Hyderabad: మేడారం జాతరకు 4,479 బస్సులు రైయ్..రైయ్..! బస్సుల కొరతతో నగరవాసుల అవస్థలు!
Medaram Jatara

Updated on: Feb 20, 2024 | 11:07 AM

వరంగల్, ఫిబ్రవరి 20: రెండేళ్లకోసారి మాఘమాసంలో నాలుగురోజుల పాటు నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తెలంగాణ వాసులకు ప్రత్యేకం. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఈ జాతర జరుగుతుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా కోటిమందికి పైగా భక్తులు తరలివస్తారు. కుంభమేళా తర్వాత అదే స్థాయిలో జరిగే అతిపెద్ద జాతర ఇది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనున్న ఈ జాతరకు వచ్చే భక్తులు మొదట ఊరి పొలిమేరలోని జంపన్నవాగులో స్నానం చేస్తారు. ఆ తరువాత సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్తారు. రేపు మేడారం జాతరలో తొలి ఘట్టం మొదలుకానుంది. ఈరోజు ఏటూరునాగారం మండలం కొండాయి నుండి గోవిందరాజు.. గంగారం మండలం పోనుగొండ్ల నుండి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో పూజారులు మేడారంకు పయనం కానున్నారు. కాలి నడకన రేపు సాయంత్రం మేడారంకు పూజారులు చేరుకోనున్నారు. పూనుగొండ్ల నుండి వస్తున్న క్రమంలో పూజారులు ఏడు వాగులు దాటి పగిడిద్దరాజుకు రానున్నారు.

మేడారం మహా జాతరకు పోలీసులు సర్వం సిద్ధం చేశారు. సమ్మక్క సారక్కను వనం నుంచి జనం మధ్యకు తీసుకు వచ్చే రోప్ పార్టీని రెడీ చేశారు. 14,000 మంది సిబ్బందితో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమ్మక్క సారక్కను తీసుకొచ్చే క్రమంలో మూడంచెల రోప్ పార్టీ భద్రత రిహార్సల్స్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సమ్మక్కని తీసుకువచ్చే క్రమంలో అనుసరించే విధానాలపై జిల్లా ఎస్పీ శభరీష్ రోప్ పార్టీకి దిశానిర్దేశం చేశారు. చిలకలగుట్ట నుండి మేడారం గద్దెల వరకు, అటు కన్నెపల్లి నుండి మేడారం వరకు రోప్ పార్టీ డ్రిల్ నిర్వహించారు.

మేడారం జాతరకు 4,479 బస్సుల కేటాయింపు

ఈ జాతరకు వచ్చే భక్తులు వరంగల్‌ వరకూ రైలు లేదా బస్సుల్లో చేరుకోవాలి. అక్కడినుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వం 4,479 బస్సులను ఈ జాతర కోసం కేటాయించింది. బుధవారం నుంచి ఆదివారం వరకు జరకు జరిగే జాతరకు 4,479 బస్సులు భక్తుల సౌకర్యార్ధం తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వీటితోపాటు పాఠశాల, కళాశాల బస్సుల్లాంటి ప్రైవేటు వాహనాలు కూడా మరో 1500 వరకు ఏర్పాటు చేసింది. ఇలా సుమారు 6 వేల బస్సులు ఐదు రోజుల పాటు మేడారం భక్తుల కోసం నడపనున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి బస్సులు నిర్ధిష్ట ప్రదేశాలకు చేరుకున్నాయి. బస్‌స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. మరోవైపు రైల్వే అధికారులు ఈసారి 30 ప్రత్యేక రైళ్లను మేడారం కోసం తిప్పుతున్నారు.

ఇవి కూడా చదవండి

బస్సులు లేక నగరవాసుల తిప్పలు

ఒకేసారి పెద్ద సంఖ్యలో బస్సులు అందుబాటులో లేకపోతే సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మహాలక్షి పథకంతో ప్రయాణికులు పెరిగిన క్రమంలో 90 శాతం మంది బస్సుల కోసం చూస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు 30 లక్షల మేర ఉంటోంది. ఇలాంటి సమయంలో.. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బస్సుల కొరత ఏర్పడటంతో గంటల కొద్ది ప్రయాణికులు బస్టాండ్‌లలో వేచి చూస్తున్నారు. బుధవారం నుంచి మిగతా బస్సులు కూడా వెళ్లిపోతే పరిస్థితి ఏంటని అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.