AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RSS Telangana: రంగరాజన్‌‌పై దాడి విషయంలో RSSపై దుష్ప్రచారం.. చర్యలకు ఉపక్రమించిన సంస్థ

చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రంగరాజన్ పై ఇటీవల జరిగిన దాడిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తెలంగాణ తీవ్రంగా ఖండించింది. RSS తెలంగాణ ప్రచార ప్రముఖ్ కట్టా రాజుగోపాల్ ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సంఘటనపై ఆ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన RSS నిందితులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయినప్పటికీ దాడి చేసిన వారు ఆ సంస్థకు చెందినవారే అని కొందరు ప్రచారం చేయడంపై RSS న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించింది.

RSS Telangana: రంగరాజన్‌‌పై దాడి విషయంలో RSSపై దుష్ప్రచారం.. చర్యలకు ఉపక్రమించిన సంస్థ
Sri Rangarajan
Ram Naramaneni
|

Updated on: Feb 16, 2025 | 8:43 AM

Share

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన వ్యక్తులతో తమ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌- RSS ప్రకటించింది. దాని చేసిన వ్యక్తులు స్వయంసేవకులు అని, ఆ సంస్థకు తమకు సంబంధాలున్నాయని చెప్పడం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. రంగరాజన్‌పై దాడి చేసిన మొదటి రోజే తాము ఖండించినట్లు RSS వివరించింది. దోషులపై సత్వరం చర్యలకు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు స్పష్టం చేసింది. RSS‌ని అప్రతిష్టపాలు చేసేందుకు, దాడి కారకులను తమకు ముడిపెట్టి దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపడింది. తప్పుడు చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఇప్పటికే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు RSS ప్రకటించింది.

దాడిని ఖండిస్తూ ఈ నెల 10వ తేదీనే ప్రెస్‌నోట్ విడుదల చేశారు తెలంగాణ ప్రచార ప్రముఖ్ కట్టా రాజు గోపాల్. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని RSS డిమాండ్ చేసింది. రంగరాజన్ టెంపుల్స్ హిందూ టెంపుల్స్ పరిరక్షణకు కృషిచేస్తున్నట్లు ప్రకటించింది. అలాంటి వ్యక్తిపై జరిగిన దాడిని…  సామాజిక విలువలు, సనాతన ధర్మంతో ముడిపడిన అర్చక దేవాలయ వ్యవస్థపై, మొత్తం హిందూ సమాజంపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నట్లు తెలిపింది. ధర్మపరిరక్షణ ముసుగులో వ్యక్తిగత ప్రయోజనం కోసం స్వార్థపూరిత చర్యలకు పాల్పడేవారిని ఎంతమాత్రం ఉపేక్షించకూడదని స్పష్టం చేసింది.

అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటివరకు 18మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం కౌశలేంద్ర ట్రస్ట్‌ పేరుతో.. రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేశాడు వీరరాఘవరెడ్డి. రూ.20 వేల జీతం, వసతి అంటూ ప్రకటనలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీరరాఘవరెడ్డి ఉచ్చులో చిక్కిన అమాయకులను తాను ఫేమస్ అవ్వడం కోసం వాడుకున్నాడు. మరోవైపు వీరరాఘవరెడ్డిని కస్టడీకి కోరారు మొయినాబాద్ పోలీసులు. కస్టడీపై రాజేంద్రనగర్‌ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి