CM KCR: గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్.. వీడియో చూశారా..?
CM KCR files nomination: భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గజ్వెల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సీఎం కేసీఆర్ గురువారం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. అక్కడి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ముందుగా హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో గజ్వేల్‌కు చేరుకున్నారు.
CM KCR files nomination: భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సీఎం కేసీఆర్ గురువారం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. అక్కడి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ముందుగా హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో గజ్వేల్‌కు చేరుకున్నారు. ఆయనకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.. అనంతరం ర్యాలీగా ఆర్డీవో ఆఫీస్‌కి వెళ్లి అధికారులకు నామినేషన్ పత్రాలను కేసీఆర్ అందించారు.
ఇక గజ్వేల్‌లో నుంచి కేసీఆర్ నేరుగా కామారెడ్డికి బయలుదేరారు..అక్కడి ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలను కేసీఆర్ అందజేస్తారు. అనంతరం.. డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు కేసీఆర్.. అయితే కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి స్వయంగా కేసీఆరే బరిలోకి దిగుతుండటంతో.. గులాబీ బాస్ రాకపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
