Telangana Phone Tapping Case: ‘ఆయన ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశాం’.. మూడో రోజు కస్టడీలో తిరుపతన్న, భుజంగరావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. తిరుపతన్న, భుజంగరావును కస్టడీకి తీసుకున్న దర్యాప్తు బృందం.. కీలక అంశాలను రాబడుతోంది. ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తిరుపతన్న, భుజంగరావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన ఆధారాలతో మరికొంతమందిని దర్యాప్తు బృందం విచారించనుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. తిరుపతన్న, భుజంగరావును కస్టడీకి తీసుకున్న దర్యాప్తు బృందం.. కీలక అంశాలను రాబడుతోంది. ప్రణీత్ రావు, రాధా కిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తిరుపతన్న, భుజంగరావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన ఆధారాలతో మరికొంతమందిని దర్యాప్తు బృందం విచారించనుంది. SIB మాజీ డైరెక్టర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్టు తిరుపతన్న, భుజంగరావు చెప్పారు. అయితే కేసులో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై దర్యాప్తు అధికారులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. మూడో రోజు కస్టడీలో తిరుపతన్న, భుజంగరావును విచారిస్తున్నారు. ఎస్‌ఐబీ మాజీ డైరెక్టర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామని తిరుపతన్న, భుజంగరావు చెప్పిన నేపథ్యంలో మరిన్ని వివరాలను సేకరించనున్నారు.
మరోవైపు తిరుపతన్న, భుజంగరావు వాడిన కంప్యూటర్స్, సెల్‌ఫోన్స్‌ను అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో డబ్బు రవాణాకు టాస్క్ ఫోర్స్, SOT పోలీసులను వాడుకున్నట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. సోమవారం నాంపల్లి కోర్టులో రాధాకిషన్ రావును వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ దర్యాప్తు బృందం పిటిషన్ వేయనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..