తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీ ఈసెట్)-2023 ఫలితాలు గురువారం (జూన్ 8) విడుదల కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3.30గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు. పరీక్షకు హాజరైన విద్యార్ధులు ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
కాగా 2023-24 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్/ఫార్మసీ/ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) పీజీఈసెట్ 2023 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే 29 నుంచి జూన్ 1వరకు ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష జరిగింది. దాదాపు 14,882 మంది విద్యార్దులు పరీక్షలకు హాజరయ్యారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.