యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం.. మార్చురీలో మృతదేహాన్ని కొరుక్కుతిన్న ఎలుకలు!

| Edited By: Srilakshmi C

Aug 01, 2023 | 11:36 AM

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీలో దారుణ ఘటన వెలుగు చూసింది. మార్చురీలోని ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్‌ (38) కుటుంబంతో సహా 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరుగగా.. వారికి ఓ కుమార్తె జన్మించింది. అనంతరం కొంతకాలానికి రవికుమార్‌ భార్య మృతి..

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం.. మార్చురీలో మృతదేహాన్ని కొరుక్కుతిన్న ఎలుకలు!
Rats Eat Dead Body
Follow us on

యాదాద్రి భువనగిరి, ఆగస్టు 1: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీలో దారుణ ఘటన వెలుగు చూసింది. మార్చురీలోని ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్‌ (38) కుటుంబంతో సహా 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరుగగా.. వారికి ఓ కుమార్తె జన్మించింది. అనంతరం కొంతకాలానికి రవికుమార్‌ భార్య మృతి చెందింది. కొన్నాళ్లకు రెండో వివాహం చేసుకోగా వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఐతే రెండో భార్య ఏడాది క్రితం రవికుమార్‌ను వదిలి వెళ్లింది. దీంతో రవికుమార్‌ తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి ప్రగతినగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.

డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రవికుమార్‌ మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటి కొచ్చిన అతను తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న రవి కుమార్ పోరు పడలేక అతని తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. రాత్రి 11:30 నిమిషాల ప్రాంతంలో ఇంటికి తిరిగొచ్చే సరికి రవికుమార్‌ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా మృతదేహాన్ని బయటే భద్రపరిచారు.

ఈ క్రమంలో రవికుమార్‌ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. ఐతే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మరోవైపు మృత దేహాన్ని ఎలుకలు కొరికి తిన్నట్లు జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చిన్నానాయక్‌ పేర్కొనడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.