Telangana: ఆహా.. ఏమివాడకం! ఫేస్‌ మాస్క్‌ ముఖానికి కాకుండా ఇంకోలా వాడి అడ్డంగా బుక్కయ్యాడు..

|

Jan 21, 2023 | 6:34 PM

కరోనా మహమ్మారి పుణ్యమా అని ముఖానికి మాస్క్ ధరించడం తప్పని సరైపోయింది. ముఖానికి ఏ విధంగా మాస్క్‌ ధరించాలో కూడా అప్పట్లో ప్రత్యేకంగా క్లాసులు కూడా పీకారు. ఇంత జరిగినా ఓ యువకుడు మాత్రం ఫేస్‌మాస్క్‌ ముఖానికి కాకుండా దేనికి..

Telangana: ఆహా.. ఏమివాడకం! ఫేస్‌ మాస్క్‌ ముఖానికి కాకుండా ఇంకోలా వాడి అడ్డంగా బుక్కయ్యాడు..
Telangana News
Follow us on

కరోనా మహమ్మారి పుణ్యమా అని ముఖానికి మాస్క్ ధరించడం తప్పని సరైపోయింది. ముఖానికి ఏ విధంగా మాస్క్‌ ధరించాలో కూడా అప్పట్లో ప్రత్యేకంగా క్లాసులు కూడా పీకారు. ఇంత జరిగినా ఓ యువకుడు మాత్రం ఫేస్‌మాస్క్‌ ముఖానికి కాకుండా దేనికి ధరించాడో తెలిస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. ఇదెక్కడో విదేశాల్లో జరిగుంటుందని అనుకుంటే పొరపాటే. మన తెలంగాణ కుర్రాడి సృజనాత్మకతే. వివరాల్లోకెళ్తే..

మంచిర్యాలకు చెందిన ఓ కుర్రాడు బైక్‌ నంబర్‌ ప్లేటు కనిపించకుండా ఫేస్‌మాస్క్‌ను తొడిగాడు. ఆనక.. సాఫీగా రోడ్డుమీద బైకుపై వెళ్తుంటే మంచిర్యాల పట్టణ పోలీసులు అడ్డగించి ఈ- చాలన్ ద్వారా జరిమానా విధించారు. శుక్రవారం వాహన తనిఖీల్లో పట్టుబడిన సదరు యువకుడికి పోలీసులు జరిమానాతోపాటు కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టినట్లుగా మంచిర్యాల పట్టణ సీఐ నారాయణ తెలిపారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్ కనిపించకుండా వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌లపై స్టిక్కర్లుగాని, నంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్కులను తగిలించడంగానీ చేస్తే భారీగా మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ ఈ చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం కొందరు వాహనాలపై ఫ్యాన్సీ నంబర్‌తో పాటు తప్పుడు నంబర్‌లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారని, ఇకపై ఇలాంటివి చేస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని మంచిర్యాల పట్టణ పోలీసులు హెచ్చిరలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.