Telangana Secretariat: అడవి బిడ్డలకు గుడ్ న్యూస్!.. కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సంతకం దానిపైనే..?

|

Apr 30, 2023 | 1:34 PM

తెలంగాణ రాజసానికి నిలువుటద్దంలా మెరిసిపోతున్న నూతన సచివాలయ ప్రారంభోత్సవ ఘట్టం కొనసాగుతోంది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దంపతులు సుదర్శన యాగం, చండీ హోమాల్లో పాల్గొన్నారు.

Telangana Secretariat: అడవి బిడ్డలకు గుడ్ న్యూస్!.. కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ తొలి సంతకం దానిపైనే..?
Cm Kcr (file Photo)
Follow us on

తెలంగాణ రాజసానికి నిలువుటద్దంలా మెరిసిపోతున్న నూతన సచివాలయ ప్రారంభోత్సవ ఘట్టం కొనసాగుతోంది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దంపతులు సుదర్శన యాగం, చండీ హోమాల్లో పాల్గొన్నారు.

ఉదయం 5.50 గంటలకు రుత్విక్కులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఉదయం 6.15నిమిషాలకు సచివాలయానికి చేరుకున్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దంపతులు యాగశాలకు హాజరై చండీయాగం, సుదర్శన యాగాల్లో పాల్గొన్నారు. హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలోని వేర్వేరు చాంబర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్లొంటారు.

మధ్యాహ్నం 1.20 గం.లకు సీఎం కేసీఆర్‌ సచివాలయానికి చేరుకుంటారు. యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆరో ఫ్లోర్‌లోని తన ఛాంబర్‌లోని కుర్చీలో ఆసీనులవుతారు. మరోవైపు సచివాలయం పరిసరాల్లో 650మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం జీఏడీ పాస్‌లు ఉన్న ఉద్యోగుల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇవాళ ఎవరు ఏ ఫైల్‌ మీద సంతకం చేస్తున్నారు అనేది ఓసారి చూద్దాం..

1. పోడు భూముల పంపిణీపై తొలి సంతకం చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

2. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ఫైల్‌పై సంతకం చేయనున్నారు మంత్రి కేటీఆర్.

3. సీతారామ ప్రాజెక్ట్‌ ఫైల్‌పై హరీష్‌రావు తొలి సంతకం చేయనున్నారు.

4. 18 చెక్‌డ్యామ్‌లకు అనుమతిపై సంతకం చేయనున్నారు మంత్రి నిరంజన్‌రెడ్డి.

5. దళితబంధు రెండో విడత ఫైల్‌పై మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతకం చేయనున్నారు.

6. GHMC పరిధిలోని దేవాలయాల్లో ధూపదీప నైవేద్యంపై సంతకం చేయనున్నారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.

7. కొత్త పోలీస్‌స్టేషన్ల మంజూరుపై మహమూద్ అలీ సంతకం చేయనున్నారు.

8. శ్రమశక్తి అవార్డుల ఫైల్‌పై మంత్రి మల్లారెడ్డి సంతకం చేయనున్నారు.

9. ఐకేపీ గ్రూపులకు మండలాలవారీగా కొత్త భవనాల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌పై మంత్రి ఎర్రబెల్లి సంతకం చేయనున్నారు.

10. అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా ఫైల్‌పై మంత్రి గంగుల సంతకం చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..