నిర్లక్ష్యం.. మనిషి ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఎవరో చేసిన తప్పులకు మరొకరు ప్రాణాలను బలి అవుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, మ్యాన్ హోల్, విద్యుత్ ఘటనలు ఇలా ఎవరో చేసిన తప్పులకు అమాయకులు చనిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లపేట ప్రాంతంలో ఓ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వేలాడుతున్న విద్యుత్ తీగ మెడ కు తగిలి ఓక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు ఓ వ్యక్తి.. అదే సమయంలో ఓ స్కూల్ బస్సు కి పెద్ద ప్రమాదం తప్పింది.
బండ్ల గూడ లో ఉదయాన్నే నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళలను ఢీ కొట్టి పొట్టన పెట్టుకున్నాడు ఓ నిర్లక్ష్యంపు డ్రైవింగ్ వలన ఎంతో మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన వారసిగూడా లో మౌనిక అనే చిన్నారి మ్యాన్ హోల్ కొట్టుకొని పోయి మృత్యువాత పడింది. తాజాగా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లంపేట ప్రాంతంలో విద్యుత్ తీగ మెడ కు చుట్టుకొని అక్కడికి అక్కడే మృతి చెందింది. అప్పటికే విద్యుత్ తీగ తగిలి పంది షాక్ గురై చనిపోయింది.
అక్కడ నీటి గుంత ఉండటం వలన అటు వైపు గా 30మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్ కి అతి పెద్ద ప్రమాదం తప్పింది. నీటి లో అప్పటికే నీటి గుంతలో చనిపోయిన జంతువు ను చూసి స్కూల్ బస్ పక్క నుండి వెళ్ళిపోయింది. అనంతరం 2నిమిషాల తరువాత 2 విల్లర్ పై వచ్చిన సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నీటి గుంతను చూసి పోల్ పక్క నుండి వెళ్ళాడు అప్పటికే వేలాడీ ఉన్న విద్యుత్ తీగ మెడ కు తగలడం తో కుప్పకూలిపోయాడు. అక్కడికిక్కడే మృతి చెందాడు. అదే సమయంలో ఎంతో మంది పిల్లలు అటు వైపు గా స్కూల్స్ వెళ్తూ వస్తూ ఉన్నారు. లేకపోతే ఎంతో మంది చనిపోయి ఉండేవారు అని స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. ఉరి తాడుల్లా వేలాడుతున్న విద్యుత్ తీగల, కేబుల్ తిగలపై అధికారులు దృష్టి పెట్టాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..