AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: వాసాలమర్రిలో శరవేగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు.. సీఎం కేసీఆర్ దత్తతతో మారుతున్న రూపు రేఖలు

Vasalamarri Village: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న దత్తత గ్రామం వాసాలమర్రి సకల హంగులతో సర్వాంగ సుందరంగా మారుతోంది. గ్రామ రూపురేఖలను మార్చేందుకు152 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. గ్రామంలోని దళితవాడలో పర్యటించి దళితుల ఇళ్లను పరిశీలించి స్థానికులతో సహపంక్తి భోజనం చేశారు. వాసాలమర్రి అభివృద్ధికి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. గ్రామ అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ ను స్పెషల్ ఆఫీసర్ గా సీఎం కేసీఆర్ నియమించారు.

CM KCR: వాసాలమర్రిలో శరవేగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు.. సీఎం కేసీఆర్ దత్తతతో మారుతున్న రూపు రేఖలు
Vasalamarri Village
M Revan Reddy
| Edited By: Sanjay Kasula|

Updated on: Aug 08, 2023 | 12:51 PM

Share

వాసాలమర్రిలో శరవేగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దత్తత తీసుకోవడంతో ఈ గ్రామం రూపు రేఖలు మారుతున్నాయ. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు 2020 నవంబర్‌ 1న సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 2021 జూన్‌ 22న వాసాలమర్రిలో గ్రామసభ నిర్వహించి గ్రామ సమస్యలను అడిగి తెలుసు కున్నారు. గ్రామంలోని దళితవాడలో పర్యటించి దళితుల ఇళ్లను పరిశీలించి స్థానికులతో సహపంక్తి భోజనం చేశారు. వాసాలమర్రి అభివృద్ధికి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. గ్రామ అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ ను స్పెషల్ ఆఫీసర్ గా సీఎం కేసీఆర్ నియమించారు.

గ్రామంలోని పూరి గుడిసెలు పురాతన ఇళ్లను కూల్చివేసి వాటి స్థానంలో పక్కా ఇల్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ లేఅవుట్‌ తయారు చేసి విశాలమైన రోడ్లతో పాటు కమ్యూనిటీ, అంగన్‌వాడీ భవనం, ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనాలు, గ్రామ పంచాయతీ భవనం, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, కమర్షియల్‌ కాంప్లెక్స్‌, ఆట స్థలం, సెప్టిక్‌ ట్యాంకులను ఆధునిక హంగులతో మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. దేశానికే రోల్ మోడల్ గా వాసాలమర్రిని తీర్చిదిద్దేందుకు 152 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మౌలిక వసతుల కల్పనకు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ రూపురేఖలను మార్చనున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనాల నిర్మాణానికి మొత్తం రూ.3.58 కోట్లు, మూడు అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు రూ.75 లక్షలు కేటాయించారు. అదనంగా ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయించారు.

గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 30 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుత ఈ పనులన్నీ ప్రారంభమై భవన నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయి. వాసాలమర్రి గ్రామానికి మాత్రమే కాకుండా పరిసర గ్రామాలైన కొండాపురం, తిరుమలాపురం, గోపాల పూర్, శ్రీనివాసపూర్ లకు కూడా విద్యుత్ ను అందించేందుకు మూడు కోట్ల రూపాయలతో చేపట్టిన 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తైంది.

వాసాలమర్రిలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధితో పాటు గ్రామస్తులందరికీ వారి వారి స్థానాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే గ్రామంలోని 103 పక్కా ఇళ్లు, మరో 481 పెంకుటిళ్లు, రేకుల ఇళ్లు, గుడిసెలను కూల్చివేసి వాటి స్థానంలో పక్కా ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. విశాలమైన రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం కూడా అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇళ్ల నిర్మాణంతోపాటు మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో గ్రామంలో ఇప్పటికే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మిగిలిన అభివృద్ధి పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని గ్రామ సర్పంచి ఆంజనేయులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో గ్రామ రూపురేఖలే మారుతున్నాయని, మాస్టర్ ప్లాన్ పూర్తయితే దేశానికే వాసాలమర్రి రోల్ మోడల్ గా నిలుస్తుందని సర్పంచ్ చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం