Telangana: రేపే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌.. కేంద్రాల వద్ద మూడెంచల భద్రత..

|

Dec 13, 2021 | 6:43 PM

Telangana MLC Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ రేపు జరగనుంది. ఈ మేరకు పకడ్బంధీగా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 10వ తేదీన

Telangana: రేపే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌.. కేంద్రాల వద్ద మూడెంచల భద్రత..
Telangana Mlc Elections
Follow us on

Telangana MLC Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ రేపు జరగనుంది. ఈ మేరకు పకడ్బంధీగా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 10వ తేదీన నిర్వహించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కోసం ఆయా జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉద‌యం 8 గంట‌ల‌ నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పూర్తిస్థాయి ఫ‌లితాలు వెల్లడి అయ్యే అవ‌కాశం ఉందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని.. శంశాంక్ గోయల్ పేర్కొన్నారు.

ఐదు చోట్లా రేపు ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాళ్లల్లో ఆదిలాబాద్‌లో ఆరు, కరీంనగర్‌లో 9, మిగతా చోట్ల ఐదు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదట 25 చొప్పున కట్టలుగా కట్టి ఆ తర్వాత డీటెయిల్డ్ లెక్కింపు చేపడతారని శశాంక్ గోయల్ తెలిపారు. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారన్నారు. ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించినట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితం రిపోర్ట్ చూపాలని పేర్కొన్నారు. ఫలితం అనంతరం ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదన్నారు. గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.

స్థానిక సంస్థల కోటాలో కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానా‌నికి 10న పోలింగ్ నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడెంచల భద్రతను ఏర్పాటుచేశారు. కాగా.. కరీంనగర్‌లోని రెండు స్థానాల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. టీఆర్‌ఎస్‌ రెబల్‌గా బరిలోకి రవీందర్‌ దిగడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. దీంతోపాటు మెదక్‌, ఖమ్మంలో కాంగ్రెస్‌-టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ ఉంది. కాగా.. ఒక్కొక్క స్థానానికి నాలుగు టేబుల్స్‌, ముగ్గురు సిబ్బంది చొప్పున ఉంటారు. ప్రతి రౌండ్‌లో 200 ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read:

CM KCR: శ్రీరంగంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు.. మంగళవారం తమిళనాడు సీఎంతో ప్రత్యేక సమావేశం..

Telangana IAS, IPS: త్వరలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు.. రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం