MLC Elections Results 2021 Live: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జయభేరి
TS - AP MLC Elections 2021 Live updates: తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
MLC Elections Results: తెలంగాణలో తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఏ ఎన్నికలైనా తిరుగులేదనిపించింది. ఇవాళ వెలువడిన ఫలితాల్లో ఆరు సీట్లలోనూ గులాబీ అభ్యర్థులు గెలుపొందారు.
ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఐదుచోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార పార్టీ అభ్యర్థులు ఎల్ రమణ, భాను ప్రసాదరావు, స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు గోయల్ పేర్కొన్నారు. 5 చోట్లా రేపు ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాళ్లల్లో ఆదిలాబాద్‌లో ఆరు, కరీంనగర్‌లో 9, మిగతా చోట్ల ఐదు టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మొదట 25 చొప్పున పోలైన ఓట్లను కట్టలుగా కట్టి ఆ తర్వాత లెక్కింపు చేపట్టనున్నారు. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారని వెల్లడించారు. ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించినట్లు తెలిపారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇక ఫలితాల ప్రకటన అనంతరం ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు అనుమతించనున్నామని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీకి సంబంధించి కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్‌లో కౌంటింగ్ జరగనుంది. మొత్తం 1,324 ఓట్లకు గాను.. ఇక్కడ 1,320 ఓట్లు పోలవగా 99.70 శాతం ఓటింగ్ నమోదైంది. టీఆర్ఎస్ నుంచి ఎల్.రమణ, భానుప్రసాదరావు.. ఇండిపెండెంట్ అభ్యర్థులు రవీందర్ సింగ్, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తం 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 33 శాతం ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల తో విజేత తేలకపోతే.. రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు జరగనుండటంతో.. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. మహిళా శక్తి సమైఖ్య భవనంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. నాలుగు టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరుపుతారు. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్ వైజర్, నలుగురు సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు ఉంటుంది. ప్రతి టేబుల్‌పై 200 ఓట్లు లెక్కిస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం ఎమ్మెల్సీ ఓట్లు 1,271 ఉండగా, 1,233 ఓట్లు పోలయ్యాయి. బరిలో ఏడుగురు అభ్యర్థులు ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కె.నగేష్, ఇండిపెండెంట్‌గా వంగూరు లక్ష్మయ్యలు బరిలో ఉన్నారు.
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ ఇవాళ జరుగుతోంది. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ నేతలు ఐక్యంగా పనిచేశారని, గులాబీ దళమే విజయకేతనం ఎగరేస్తుందని నేతలు దీమా వ్యక్తం చేశారు. ఖమ్మం ఫలితాల్లో ఎమ్మెల్సీగా టీర్ఎస్ అభ్యర్థిగా తాతా మధు పోటీ చేశారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా పరధిలో 768 ఓట్లు ఉంటే 740 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 95 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి మెదక్ పరిధిలో 1026 ఓట్లు ఉంటే 1018 ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలింగ్ 99.22శాతం నమోదైంది. పోటీలో ముగ్గురు అభ్యర్థులున్నారు. టీఆర్ఎస్ నుంచి ఒంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి నిర్మల జగ్గారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా మట్టా మల్లారెడ్డి పోటీలో ఉన్నారు.
కౌంటింగ్ ప్రక్రియలో కచ్చితంగా కోవిడ్ రూల్స్ పాటించాలని ఆదేశించింది ఈసీ. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించింది. రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపిస్తేనే.. ఏజెంట్లకు కౌంటింగ్ హాల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.
LIVE NEWS & UPDATES
-
కరీంనగర్ రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ఉన్న భానుప్రసాద్, ఎల్.రమణ ఇద్దరూ గెలుపొందారు. ఇక్కడ మొత్తం 1320 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 17 ఓట్లు చెల్లనివి కాగా, 1303 చెల్లుబాటు అయ్యాయి. భానుప్రసాద్‌కు 584 ఓట్లు రాగా, రమణకు 479 ఓట్లు వచ్చాయి.
-
మెదక్‌లో వంటేరు యాదవరెడ్డి గెలుపు
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జయభేరి మోగిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపొందారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి వంటేరు యాదవరెడ్డికి 762 ఓట్ల వచ్చాయి. సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థికి 238 ఓట్లే పోలయ్యాయి. మరో స్వతంత్ర అభ్యర్థికి కేవలం ఆరు ఓట్లే వచ్చాయి. మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 12 ఓట్లు చెల్లనివిగా తేలాయి.
-
-
ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా విఠల్ విజయం
ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి పుష్కరంపై 666 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 862 ఓట్లు పోలవగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి విట్టల్‌కు మొత్తం 740 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి పుష్కరానికి కేవలం 74 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా, మొత్తం చెల్లని ఓట్లు 48 నమోదయ్యాయి.
-
టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం
కరీంనగర్‌లో ఎల్.రమణ, భానుప్రసాద రావు విజయం సాధించారు. ఖమ్మంలో తాతా మధు, నల్గొండలో ఎంసీ కోటిరెడ్డి గెలుపొందారు. మెదకలో ఓటేరు యావదరెడ్డి, ఆదిలాబాద్‌లో దండే విఠల్ విజయం సాధించారు.
-
పెద్దల సభలో కారుదే జోరు
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఏ ఎన్నికలైనా తిరుగులేదనిపించింది. ఇవాళ వెలువడిన ఫలితాల్లో ఆరు సీట్లలోనూ గులాబీ అభ్యర్థులు గెలుపొందారు. ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు ఇవాళ చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఐదుచోట్ల ఓట్ల లెక్కింపు నిర్వహించారు.
-
-
ఖమ్మంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం
ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి తాతా మధు 247 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. పట్టణంలోని డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ కార్యాలయం(DPRC) భవనంలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 768 ఎమ్మెల్సీ ఓట్లకు గానూ 738 ఓట్ల పోలయ్యాయి. TRS అభ్యర్థి తాతా మధుకు 486 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 239 ఓట్లు వచ్చాయి. దీంతో తొలి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధు గెలుపొందినట్లు ఈసీ అధికారులు ప్రకటించారు.
-
మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి 203 ఓట్ల ఆధిక్యం
ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వంటేరు యాదవరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 299 ఓట్లు రాగా… కాంగ్రెస్ అభ్యర్ధి నిర్మలా జగ్గారెడ్డికి 96 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి 203 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
-
మొదలైన మెదక్ జిల్లా ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్
ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో చేపట్టారు. ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి వంటేరి యాదవరెడ్డి, కాంగ్రెస్ నుంచి తూర్పు నిర్మల, స్వతంత్య్ర అభ్యర్థిగా మట్ట మల్లారెడ్డి బరిలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాల్లో 1,026 ఓట్లకు గాను 1,018 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను నాలుగు టేబుళ్లపై లెక్కించనున్నారు. 12 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు చొప్పున కేటాయించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 100 మంది పోలీసులతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
-
ఖమ్మం DPRC భవనంలో ఓట్ల లెక్కింపు
ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. పట్టణంలోని డిస్ట్రిక్ట్ పంచాయతీ రాజ్ కార్యాలయం(DPRC) భవనంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. లెక్కింపు ప్రాంగణంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 768 ఎమ్మెల్సీ ఓట్లకు గానూ 738 ఓట్ల పోలయ్యాయి. ఇందుకోసం నాలుగు టేబులను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ కు ఒక సూపర్ వైజర్, నలుగురు సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు. ప్రతి టేబుల్ పై 200 ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లు సగం కన్నా ఒక్క ఓటు ఎక్కువ దాటితే అభ్యర్థి విజయం ఖరారు చేస్తారు.. బరిలో నలుగురు అభ్యర్థులు నిలిచారు.. టీఆర్ఎస్ నుంచి తాతా మధు, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండ్రు సుధారాణి పోటీ పడుతున్నారు.
-
ఆదిలాబాద్‌లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు టీటీడీసీ సెంటర్ లో మొదలైంది. ఇందుకోసం నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఒక్కో టేబుల్ పై 200 ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం అదనంగా ఐదవ టేబుల్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 937 ఓట్లకు గాను 860 ఓట్లు పోలయ్యాయి. మద్యాహ్నం లోగా తుది ఫలితం వెలువడవచ్చని అధికారులు భావిస్తున్నారు. అధికార పార్టీ నుండి దండె విఠల్, స్వతంత్ర్య అభ్యర్థిగా పెందూరి పుష్పరాణి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద మూడెంచల భద్రత. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది పోలీస్ శాఖ.
-
నల్లగొండలో మొదలైన కౌంటింగ్
నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పట్టణంలోని మహిళా శక్తి భవనంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లెక్కింపు ప్రాంగణంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. నాలుగు టేబుల్లో లెక్కింపు చేపట్టగా.. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్ వైజర్, నలుగురు సిబ్బంది ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ప్రతి టేబుల్ పై 200 ఓట్లను లెక్కించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 1,271 ఓట్లకు గానూ 1233 పోలయ్యాయి. ఎమ్మెల్సీ బరిలో ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
-
మూడు చోట్ల ఫలితాలపై ఆసక్తి!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు 10 మంది, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక స్థానానికి ఏడుగురు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు, ఖమ్మంలో నలుగురు, మెదక్‌లో ముగ్గురు బరిలో నిలిచారు. కాగా మూడు స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీక గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాల్లో క్రాస్‌ఓటింగ్ జరిగినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-
పోటీలో 26మంది అభ్యర్థులు
మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 9వ తేదీన షెడ్యూల్ విడుదలైంది. ఇందులో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు స్థానాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఈ నెల 10న పోలింగ్ నిర్వహించారు. మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు
-
మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి
అయా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
-
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఈనెల 10వ తేదీన నిర్వహించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఆయా జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని.. శంశాంక్ గోయల్ పేర్కొన్నారు.
-
మరికాసేపట్లో కౌంటింగ్ షురూ
తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో మొదలుకానుంది. ఈ మేరకు పకడ్బంధీగా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
Published On - Dec 14,2021 7:02 AM