Covid-19: థర్డ్‌వేవ్‌ ముప్పుపై అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం.. విద్యాసంస్థలకు కీలక ఆదేశాలు

Telangana Covid-19: గత ఏడాదికిపైగా కోవిడ్‌ మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పడతున్న నేపథ్యంలో మరో వేరియంట్‌ విరుచుకుపడటం ఆందోళనకు..

Covid-19: థర్డ్‌వేవ్‌ ముప్పుపై అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం.. విద్యాసంస్థలకు కీలక ఆదేశాలు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2021 | 5:58 PM

Telangana Covid-19: గత ఏడాదికిపైగా కోవిడ్‌ మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పడతున్న నేపథ్యంలో మరో వేరియంట్‌ విరుచుకుపడటం ఆందోళనకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రపంచ దేశాలు సైతం మరోసారి ఆందోళనకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులతో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదయితే.. ఆ విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. తాజాగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాసంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యాసంస్థల్లో ఎవ్వరికి వారు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ ముప్పు ఉన్న నేపథ్యంలో సోమవారం అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల్లో ప్రతి ఒక్కరికి మాస్క్‌లు, భౌతిక దూరం, ఇతర కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులు అప్రమత్తంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో కొన్ని విద్యాసాంస్థల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆయా విద్యా సంస్థల్లోని విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని అన్నారు. విద్యాసంస్థల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరు రెండు డోసుల కోవిడ్‌ టీకాలు తీసుకునే విధంగా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలన్నారు.

కరోనా నిబంధనలు తప్పనిసరి.. అన్ని విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగ్గా పాటించాలని, పాఠశాల గదులన్ని శానిటైజ్‌ చేయాలని, థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కొన్ని విద్యాసంస్థలు కరోనా నిబంధనలు పాటించడం లేదని సమాచారం ఉందని, అలా నిర్లక్ష్యం చేసినట్లయితే విద్యాసంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. థర్డ్‌వేవ్‌ ముప్పు ఉన్నందున ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆమె అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా కోవిడ్‌పై జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థులను అప్రమత్తం చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి:

వైరస్‌లు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి..? ఆందోళనకు గురి చేస్తున్న కొత్త వేరియంట్‌.. గుర్తించని వైరస్‌లు మరెన్నో..!

WHO: పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు.. ఇప్పటి వరకు బయటపడ్డ వేరియంట్లకు డబ్ల్యూహెచ్‌వో ఎలాంటి పేర్లు పెట్టిందంటే!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్
రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్
అందరూ కలిసి తన ఒక్కడిపైనే దాడి చేస్తున్నారు.. సీఎం జగన్
అందరూ కలిసి తన ఒక్కడిపైనే దాడి చేస్తున్నారు.. సీఎం జగన్
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ మహామానిత్వ రామయ్య ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే
దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ మహామానిత్వ రామయ్య ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే
SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు
SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
హీరోయిన్‌ పైకి వచ్చిన ఫ్యాన్.. పక్కకు నెట్టిన కమెడియన్
హీరోయిన్‌ పైకి వచ్చిన ఫ్యాన్.. పక్కకు నెట్టిన కమెడియన్
‘కుర్చీ మడతపెట్టి’ పాటకు డాన్స్ ఇరగదీసిన ఆఫ్రికన్ పిల్లలు
‘కుర్చీ మడతపెట్టి’ పాటకు డాన్స్ ఇరగదీసిన ఆఫ్రికన్ పిల్లలు