AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ముగిసిన మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన. తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు..

తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన ముగిసింది. పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని మంత్రి తెలిపారు.

Telangana: ముగిసిన మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన. తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు..
Telangana IT Minister KTR
Shiva Prajapati
|

Updated on: Jan 22, 2023 | 10:13 AM

Share

తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ దావోస్‌ పర్యటన ముగిసింది. పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని మంత్రి తెలిపారు. దావోస్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి 21వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు మంత్రి కేటీఆర్‌. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం నాలుగు రోజుల పర్యటన విజయవంతంగా కొనసాగిందన్నారు. దావోస్‌లో మొత్తం 52 వాణిజ్య సమావేశాలు, ఆరు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, రెండు ప్యానల్‌ డిస్కషన్లలో పాల్గొన్నట్టు తెలిపారు. ప్రపంచంలోని పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ 16వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో మూడు డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు మంత్రి కేటీఆర్‌. అలాగే భారతీ ఎయిర్‌టెల్‌ గ్రూప్‌ దాదాపు 2వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో భారీ హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ను నిర్మించనుందని వెల్లడించారు. ఇక ఫార్మా రంగానికి చెందిన యూరోఫిన్స్‌ సంస్థ జీనోమ్‌ వ్యాలీలో వెయ్యికోట్ల రూపాయలతో అత్యాధునిక లేబొరేటరీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు.

వీటితోపాటు ప్రఖ్యాతి గాంచిన పెప్సికో, పీఅండ్‌ జీ, అల్లాక్స్‌, అపోలో టైర్స్‌ లిమిటెడ్‌, వెబ్‌ పీటీ, ఇన్‌స్పైర్‌ బ్రాండ్స్‌ వంటి ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా 2వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రకటించినట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కొత్త పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు సానుకూల ఫలితాలను ఇస్తాయని కేటీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంత పెద్దమొత్తంలో తెలంగాణకు పెట్టుబడులు రావడం హర్షించదగ్గ విషయమన్నారాయన.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..