Medaram Jatara: మేడారం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్? టోల్ మినహాయింపుపై మంత్రి కీలక ప్రకటన!
Medaram Toll-free journey: మేడారం జాతరకు వెళ్లే భక్తులకు త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే సంక్రాంతి సెలవులు, మేడారం జాతర నేపథ్యంలో భక్తులకు ఆర్థిక భారం తగ్గించేందుకు హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసే యోచనలో ఉన్నట్టు ఇటీవల ఒక మీడియా సమావేశంలో తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటల్ రెడ్డి. దీనిపై కేంద్ర సానుకూలంగా స్పందిస్తే.. సంక్రాంతికి ఊరెళ్లే, మేడారం వెళ్లే భక్తులకు టోల్ మినహాయింపు దక్కనుంది.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ హైవేపై టోల్ ఫీజు మినహాయించాలని కేంద్రానికి లేఖ రాయడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో శనివారం జరిగిన ఒక మీడియా సమావేశంలో దీనిపై స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో జనవరి 28 నుంచి 31 వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరగనుందని. తెలంగాణ కుంభమేళాగా పిలువబడే ఈ జాతరకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో భక్తులపై ఆర్థిక భారం తగ్గించేందుకు టోల్ ఫీజ్ మినహాయింపును ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు.
ఏపీ వైపు వెళ్లే భక్తులకే కాదు.. మేడారం జాతరకు వచ్చే భక్తులకు కూడా టోల్ మినహాయింపు కల్పించేలా ప్రభుత్వం ఆలోచిస్తోందని.. త్వరలనే దీనిపై కూడా కేంద్రానికి లేఖ రాసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం కేవలం ఒక ప్రాంతం వారికే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రయాణికులందరి లబ్ధి చేకూరుస్తుందని ఆయన తెలిపారు.
అయితే జాతీర రహదారిపై ఉన్న చాలా టోల్‌ప్లాజాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంటాయి. ప్రతస్తుం హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఉన్న టోల్ ప్లాజా కూడా కేంద్రం ఆధీనంలోనే నడుస్తుంది. అందుకే పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టోల్ మినహాయింపుకోసం కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిపారు. కావాలనే కొందరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వాటిని తాము పట్టించుకోమని.. ప్రయాణికుల సౌకర్యమే తమకు ముఖ్యమని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
