Harish Rao: ఈసారి మరిన్ని పథకాలు అమలు చేస్తాం.. మహబూబాబాద్‌లో మంత్రి హరీష్‌రావు ప్రచారం..

మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్యెల్యే అభ్యర్ధి శంకర్ నాయక్‌కి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఇతర పార్టీల మీటింగులు చూస్తే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి.. కానీ బీఆర్ఎస్ ఏర్పాటు చేసే మీటింగులు జన సంద్రంలా మారుతున్నాయన్నారు. సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారని.. మానుకోట మట్టికి, రాళ్లకు దండం పెట్టారు.

Harish Rao: ఈసారి మరిన్ని పథకాలు అమలు చేస్తాం.. మహబూబాబాద్‌లో మంత్రి హరీష్‌రావు ప్రచారం..
Harish Rao Election Campaign At Maanukota
Follow us
Srikar T

|

Updated on: Nov 25, 2023 | 3:23 PM

మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్యెల్యే అభ్యర్ధి శంకర్ నాయక్‌కి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఇతర పార్టీల మీటింగులు చూస్తే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి.. కానీ బీఆర్ఎస్ ఏర్పాటు చేసే మీటింగులు జన సంద్రంలా మారుతున్నాయన్నారు. సమైక్యవాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారని.. మానుకోట మట్టికి, రాళ్లకు దండం పెట్టారు. మానుకోట దెబ్బతో సమైక్య వాదులు వెనుక్కు పరిగెత్తారని గతాన్ని గుర్తు చేశారు. మళ్లీ సమైక్యవాదులు ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారికి మన మానుకోట దమ్మేంటో చూపించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు మంచిగా పని చేసి శంకర్ నాయక్‌ని మూడోసారి గెలిపించాలన్నారు. మానుకోట రోడ్లు సిద్ధిపేట కంటే బాగున్నాయి. గులాబీ జెండా లేకుంటే మానుకోట జిల్లా అయ్యేదా? మెడికల్ కాలేజ్ వచ్చేదా? హార్టికల్చర్ కాలేజ్ వచ్చేదా? తండాలు గ్రామ పంచాయితీలు అయ్యేవా? పోడు భూములకు పట్టాలు వచ్చేవా? అని ప్రజలను అడిగారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కర్ణాటకలో ప్రచారం చేసి 5 గ్యారంటీలు అని ఊదరగొట్టి మోసం చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఏ విషయం మీద పూర్తి అవగాహన ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి నెత్తిమీద కట్టాల్నా? అని ప్రశ్నించారు. బూతులు మాట్లాడే నాయకులు కావాలా? భవిష్యత్తు అందించే నాయకుడు కావాలా? అని ప్రజలకు దిశానిర్ధేశ్యం చేశారు. నాడు కాల్వల్లో తుమ్మచెట్లు మొలిస్తే.. నేడు రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు వస్తున్నయన్నారు. బోరింగులు మాయమైపోయి ఇంటింటికీ నల్లా నీళ్లు వస్తున్నాయని జరిగిన అభివృద్దిని వివరించారు. నాడు దొంగ కరెంటు కోసం బాయి కాడ పండుకున్న రోజులు మర్చిపోయిండ్రా? ఉచిత కరెంటు అని చెప్పి ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా? అని ప్రజలకు ప్రశ్నలు సంధిస్తూనే.. కరెంట్ కావాలంటే కారుకు ఓటు వేయాలన్నారు. రిస్క్ వద్దు కారుకు ఓటు గుద్దు అనే నినాదాన్ని ప్రజలకు వినిపించారు. .

రైతు బంధు విషయంలో కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు. కేసీఆర్ చేసిన కృషి వల్ల రైతు బంధు డబ్బులు సోమవారం రోజు ఖాతాల్లో పడతాయన్నారు. రైతులను బిచ్చగాళ్లు అన్న రేవంత్ రెడ్డికి రైతులే గుణపాఠం చెప్తారు అని చెబుతూ కాంగ్రెస్ మోసం చేసే పార్టీ అని విమర్శించారు. కేసీఆర్ అంటే మాట తప్పనోడని ఇప్పటివరకు 90 శాతం హామీలను నెరవేర్చామన్నారు. రుణమాఫీ కూడా త్వరలో పూర్తి చేస్తామని రైతులకు నమ్మకాన్ని కలిగించారు. ఈ దఫా ఇళ్లు కట్టడంపై దృష్టి సారిస్తాం. మూడోసారి గెలిస్తే అసైన్డ్ భూములను పట్టా భూములుగా గుర్తిస్తామన్నారు. ఆసరా పెన్షన్లు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు పెంచి.. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు రూ. 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని వాగ్థానం చేశారు. సిద్ధిపేటకు నేను తేలేని కాలేజీలను శంకర్ నాయక్ మహబూబాబాద్‌కి తెచ్చుకున్నాడు. నా వల్లే కాని పనిని శంకర్ నాయక్ చేసి చూపించాడని కీర్తించారు. లంబాడీలకు అత్యధిక ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది కేసీఆరే. ఎస్సీ, ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ అని కొనియాడారు. మీ ఆఖరి డిమాండ్ అయిన గిరిజన బంధును ఈ సారి పక్కాగా అమలు చేస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..