PM Modi: కామారెడ్డి మోదీ సభలో కీలక పరిణామం.. విలువైన బహుమతిని అందించిన బీజేపీ నేతలు..
PM Modi Public Meeting : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే బీజేపీ లక్ష్యం అన్నారు. ఆర్టికల్ 370తో పాటూ మహిళా బిల్లు విషయంలో మాట నిలబెట్టుకున్నది తామే అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే బీజేపీ లక్ష్యం అన్నారు. ఆర్టికల్ 370తో పాటూ మహిళా బిల్లు విషయంలో మాట నిలబెట్టుకున్నది తామే అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామన్నాం.. నెరవేర్చుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఓబీసీ సామాజిక వర్గానికిని చెందిన వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉన్నారు. అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు అధిక సంఖ్యలో కేంద్ర మంత్రులుగా ఉన్నట్లు మోదీ తెలిపారు. అదే విధంగా తెలంగాణకు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు బీసీ, దళిత సామాజిక వర్గాలకు ఏమీ చేయలేదన్నారు. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని.. తాము అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తామన్నారు.
రైతుల కోసం బీఆర్ఎస్ ఏమీ చేయలేదని తమకు ఒక అవకాశం కల్పిస్తే రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. దేశ వ్యాప్తంగా రైతులకు తక్కువ ధరలకే బస్తా ఎరువును అందిస్తున్న ప్రభుత్వం బీజేపీదని చెప్పారు. రైతుల కోసం ప్రత్యేకంగా కేంద్రం కిసాన్ సమ్మాన్ యోజన పథకం అమలు చేస్తోందని తెలిపారు. దీని ద్వారా కేవలం తెలంగాణలోనే 40లక్షల మంది రైతులు లబ్ధి పోందుతున్నట్లు చెప్పారు. పాడి చేసుకొని బ్రతికే వారి కోసం పశువులకు ఉచితంగా వ్యాక్సినేషన్ పథకం అమలు చేస్తోందన్నారు.
అలాగే నిరుద్యోగులకు ప్రతి ఏటా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కేంద్రంలోని యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని కొత్తగా రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీలోని అవకతవకలను సమూలంగా ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ ప్రసంగం ముగిసిన తరువాత సభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నరేంద్రమోదీకి తెలంగాణలోని బీజేపీ ముఖ్య నాయకులు ఒక చిత్రపటాన్ని బహూకరించారు. మోదీ గతంలో తన తల్లితో ముచ్చటిస్తున్న ఫోటోను పెయింటింగ్ రూపంలో తయారు చేసి ప్రత్యేకంగా అందజేశారు. దీనిని చూస్తూ మోదీ ఆనందంతో పొంగిపోయారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..