ఐసొలేషన్ కిట్లు : మంత్రి ఈటెల

కరోనాకు భయపడొద్దని మరోసారి ప్రజలకు విజ్ణప్తి చేశారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. 80 శాతం మందికి కరోనా వ్యాధి మందులతో నయం అవుతుందని..

ఐసొలేషన్ కిట్లు : మంత్రి ఈటెల
Follow us
Anil kumar poka

|

Updated on: Aug 28, 2020 | 5:30 PM

కరోనాకు భయపడొద్దని మరోసారి ప్రజలకు విజ్ణప్తి చేశారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. 80 శాతం మందికి కరోనా వ్యాధి మందులతో నయం అవుతుందని.. 4 శాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం పడుతుందని చెప్పారు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన బాగానే పెరిగిందని.. రాబోయే రోజుల్లో కరోనాతో జీవించాలని మంత్రి అన్నారు. కోవిడ్‌ పాజిటివ్ వచ్చిన వ్యకులకు ఐసోలేషన్‌ కిట్లు ఇస్తున్నామన్నారు. గతంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయని.. అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదని చెప్పుకొచ్చారు.

దేశ వ్యాప్తంగా పోల్చితే తెలంగాణలోనే తక్కువ మరణాలు ఉన్నాయని.. కరోనాకు చంపే శక్తి లేదని.. సత్వరమే గుర్తించి చికిత్స చేయించుకోవాలని సూచించారు. దేశం నలుమూలల ఏ మంచి కార్యక్రమం జరిగినా దానిని అనుసరిస్తున్నామని.. అందులో భాగమే ‘బస్తీ దవాఖాన’ అని చెప్పారు. ఈ దవాఖానాల్లో మందులకు కొదవ లేదని.. UPHC, బస్తీ దవాఖానలో కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. వారం రోజుల నుంచి రాష్ట్రంలో రోజుకు 50 నుంచి 60 వేల టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు.