Dog Bites: ‘కుక్క కాటుల్లో తెలంగాణకు ఏడో స్థానం.. దాదాపు మూడు రెట్లు పెరిగిన సమస్య’

|

Jan 10, 2023 | 11:47 AM

దేశంలో కుక్కకాటుల్లో తెలంగాణ ఏడో స్థానంలో ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు..

Dog Bites: కుక్క కాటుల్లో తెలంగాణకు ఏడో స్థానం.. దాదాపు మూడు రెట్లు పెరిగిన సమస్య
Dog Bites
Follow us on

దేశంలో కుక్కకాటుల్లో తెలంగాణ ఏడో స్థానంలో ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. 2022లో కుక్కకాటు కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లోక్‌సభలో సమర్పించిన నివేదికలో ఈ మేరకు తెలియజేశారు. తెలంగాణలో 2022లో 80,281 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. 2014 కంటే (24,000) దాదాపు మూడు రెట్లు కేసుల సంఖ్య పెరిగినట్లు ఆయన అన్నారు.

హైదరాబాద్ జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు కోవిడ్‌ మొదలైనప్పటి నుంచి ఆయా సంత్సరాలకు సంబంధించిన నివేదికలు సమర్పించలేదన్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కార్యక్రమం కింద హైదరాబాద్‌లోని 65 శాతం వీధికుక్కలను స్టెరిలైజ్ చేశామని అధికారులు తెలిపారన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 3.4 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తమిళనాడులో 3.3 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 1.69 లక్షలు, ఉత్తరాఖండ్‌లో 1.62 లక్షలు, కర్ణాటకలో 1.46 లక్షలు, గుజరాత్‌లో 1.44 లక్షలు, బీహార్‌లో 1.1 లక్షల కేసులు నమోదయ్యాయని మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.