CM KCR: మిషన్‌-2024.. టార్గెట్‌ మోదీ.! అసెంబ్లీలో CM కేసీఆర్ ఉగ్రరూపం.. ప్రధాని మోదీపై డైరెక్ట్‌ అటాక్‌

మిషన్‌-2024. టార్గెట్‌ మోదీ.! అసెంబ్లీలో ఉగ్రరూపం ప్రదర్శించారు కేసీఆర్. ఇన్ని రోజులు ఒక లెక్క..ఇకపై మరో లెక్క అన్నట్లుగానే సాగింది స్పీచ్. మోదీపై పంచ్‌ల వర్షం కురిపించారు. మాటల మిసైళ్లు పేల్చారు.ఇప్పటి వరకు ఇంత చెత్త ప్రధానిని చూడలేదంటూ..అసెంబ్లీ సాక్షిగా అంకుశాలు ఎక్కుపెట్టారు.

CM KCR: మిషన్‌-2024.. టార్గెట్‌ మోదీ.! అసెంబ్లీలో CM కేసీఆర్ ఉగ్రరూపం..  ప్రధాని మోదీపై డైరెక్ట్‌ అటాక్‌
Cm Kcr

Updated on: Feb 12, 2023 | 10:02 PM

అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. పదేళ్ల మన్మోహన్ పాలనతో పోల్చితే మోదీ పాలనలో సాధించిన అభివృద్ధి శూన్యమంటూ విమర్శించారు. అప్పు చేయడంలో మోదీని మించిన ఘనుడు లేరన్నారు. తాను చెప్పిన మాటలు తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ సవాల్ విసిరారు కేసీఆర్. ఈ నెల 3న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగిశాయి. చివరి రోజైన ఆదివారం సభల్లో ద్రవ్య వినిమయ బిల్లులపై చర్చించారు. బిల్లుకు ఆమోదం లభించడంతో శాసనసభను నిరవధిక వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం 56.25 గంటల పాటు సాగాయి. అంతకుముందు సీఎం కేసీఆర్ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుకు జవాబు ఇచ్చారు.

సీఎం కేసీఆర్ పూర్తిగా ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ క్రమంలోనే కేంద్రంపై, మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి చేతులు జోడించి కోరుతున్నా.. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వండని కోరారు. కేంద్రానికి తాము సహకరిస్తామని.. తమకు కేంద్రం సహకరించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మన దేశంలో చాలినంత నాణ్యమైన బొగ్గు ఉందని అన్నారు.

ఎంత ఖర్చయినా సరే.. రాష్ట్రంలో ఇకపై ఒక్క నిమిషం కూడా విద్యుత్‌ పోనీయం అని ప్రకటించారు. 16 వందల మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా సమస్య లేకుండా విద్యుత్‌ అందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ధనిక రాష్ట్రం అవుతుందని అన్నారు కేసీఆర్. తెలంగాణ ధనిక రాష్ట్రం అయ్యాక.. ఎక్కువ జీతాలు వస్తాయని ఉద్యోగులకు చెప్పానని వివరించారు.

తానే ఎక్కువ జీతాలు కలగజేస్తానని చెప్పానని.. ఆ అదృష్టం తనకే దక్కిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా వారికి జీతాలు పెంచుతామని స్పష్టం చేశారు. ఉద్యోగులు కష్టపడుతున్నారు కాబట్టి.. వారికి జీతాలు పెంచుతామని వెల్లడించారు. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, ఆశా వర్కర్లు, హోంగార్డులకు 30 శాతం పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం