AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranthi: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సంక్రాంతి సంబరాలు.. బహుమతులు గెలుచుకుంది వీరే..

Sankranthi: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో భాగంగా ముగ్గుల..

Sankranthi: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సంక్రాంతి సంబరాలు.. బహుమతులు గెలుచుకుంది వీరే..
Shiva Prajapati
|

Updated on: Jan 12, 2021 | 5:36 PM

Share

Sankranthi: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 150 మంది మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు టీఆర్‌ఎస్ నేత దేవి ప్రసాద్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు వీరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీల్లో మొదటి విజేతగా సూర్యాపేటకు చెందిన లచ్చిమల్ల విజయకుమారి నిలిచారు.

తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, కరోనా గురించి తన అవగాహనను తన ముగ్గు ద్వారా ప్రదర్శించారు. ఈ ముగ్గు అందరినీ ఆకట్టుకోవడంతో నిర్వాహకులు తొలి బహుమతి ప్రకటించారు. ఇక నాంపల్లికి చెందిన భాగ్యలక్ష్మి రెండవ బహుమతి గెలచుకోగా.. మూడవ బహుమతి బేగంబజార్‌కు చెందిన మాధవతి గెలుచుకున్నారు. కాగా, మొదటి విజేతకు బహుమతిగా వాషింగ్ మిషన్ అందజేయగా, రెండవ విజేతకు మైక్రోవేవ్, ఇచ్చారు. ఇక ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అందరికీ ప్రెజర్ కుక్కర్ బహుమతిగా అందజేశారు. ఇదిలాఉంటే.. బుధవారం నాడు చార్మినార్ దగ్గర భోగి మంటల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, అందరూ ఆ సంబరాల్లో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Also read:

Thailand Open Updates: థాయిలాండ్ ఓపెన్ మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు

Ex MLC Sunitha: చంద్రబాబుపై ప్రేమ ఉంటే ఆయన భజన చేసుకోవాలి.. ఎస్ఈసీపై భగ్గుమన్న మాజీ ఎమ్మెల్సీ..