Thailand Open Updates: థాయిలాండ్ ఓపెన్ మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు

కరోనా నేపథ్యంలో దాదాపు 10 నెలల తర్వాత థాయిలాండ్ ఓపెన్ అంతర్జాతీయ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పాల్గొంటున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ లోనే ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు ఓటమి పాలైంది. ఈ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో సింధు...

Thailand Open Updates: థాయిలాండ్ ఓపెన్ మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు
Follow us

|

Updated on: Jan 12, 2021 | 5:26 PM

Thailand Open Updates: కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ కాలెండర్ లో  దాదాపు 10 నెలల తర్వాత థాయిలాండ్ ఓపెన్ అంతర్జాతీయ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పాల్గొంటున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ లోనే ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు ఓటమి పాలైంది. ఈ ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో సింధు డెన్మార్క్ షట్లర్ మియా బ్లిక్ ఫీల్డ్ తో తలపడింది. 21-16, 24-26, 13-21 తేడాతో పరాజయం పొందింది. సింధు మొదటి మ్యాచ్ లో ప్రత్యర్థిపై తన పైచేయి సాధించింది. మొదటి సెట్ ను సొంతం చేసుకుంది. అదే ఊపును అనంతరం కొనసాగించలేక పోయింది. రెండో సెట్ లో ఇరువురి మధ్య హోరాహోరా హోరీగా సాగింది. మొదట్లో సింధు పై చేయి సాధించినా.. అనంతరం మియా ఫామ్ ను సంపాదించి మ్యాచ్ ను సొంతం చేసుకుంది. మూడో నిర్ణయాత్మక మ్యాచ్ వరకూ తీసుకొచ్చింది మియా. ఇరువురు చెరొక మ్యాచ్ గెలాడంతో మూడో మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. రెండో మ్యాచ్ లో పుంజుకున్న మియా అదే జోరుని కొనసాగిస్తూ.. ఆఖరి మ్యాచ్ లో సింధుపై పట్టు సాధించి మ్యాచ్ ను సొంతం చేసుకుంది.

ఇక మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్‌ సాయి ప్రణీత్‌ కూడా తొలిరౌండ్‌లోనే వెనుదిరిగాడు. థాయ్ ప్లేయర్ వాంగ్‌ చరొయిన్‌ చేతిలో 16-21, 10-21 తేడాతో ఘోరంగా ఓడిపోయాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్‌- అశ్విన్‌ పొన్నప్ప విజయకేతనం ఎగురవేశారు. 21-11, 27-29, 21-16 తేడాతో ప్రత్యర్థి జోడీని చిత్తుచేశారు. అయితే థాయిలాండ్ ఓపెన్‌లో ఆడాల్సిన భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, కశ్యప్‌, ‌ ప్రణయ్ మ్యాచ్‌లకు దూరమయ్యారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో సైనా, ప్రణయ్‌ టోర్నీ నుంచి తప్పుకోగా.. కశ్యప్‌ క్వారంటైన్‌లో ఉన్నాడు.

Also Read: శాండిల్ వుడ్ డ్రగ్ కేసులో మరో చంచలనం… హీరో వివేక్ ఒబెరాయ్ బావమరిది అరెస్ట్

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?