Telangana: కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఐపీఎస్ ఆఫీసర్స్ సంఘం.. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఒక సభలో ప్రసంగిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల కలెక్టర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయనొక సన్నాసి, కాంగ్రెస్ కార్యకర్త అనే నిందలు వేస్తూ కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది.

Telangana: కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఐపీఎస్ ఆఫీసర్స్ సంఘం.. ఇంతకీ ఏం జరిగిందంటే?
Ktr
Follow us
Vijay Saatha

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 28, 2024 | 5:32 PM

మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. సిరిసిల్ల కలెక్టర్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కౌంటర్ ఇచ్చింది. నిబద్ధత కలిగిన హోదాలో ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ అధికారిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్‌లు  తప్పు పట్టారు. ఒక సభలో ప్రసంగిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల కలెక్టర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయనొక సన్నాసి, కాంగ్రెస్ కార్యకర్త అనే నిందలు వేస్తూ కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ చేసిన ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని అధికారులు భావిస్తున్నారు. త్వరలో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అప్పుడు ఈ అధికారులు అందరినీ గుర్తుపెట్టుకుంటామని కేటీఆర్ కలెక్టర్‌ని ఉద్దేశిస్తూ హెచ్చరించారు. కలెక్టర్‌నే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులందరీని కూడా గుర్తుపెట్టుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. దీంతో తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక ప్రెస్ నోటును రిలీజ్ చేస్తూ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించింది.

ఇది చదవండి: గోల్డ్ కొనేందుకు వచ్చింది..సేల్స్‌మ్యాన్‌‌ను మాటల్లో పెట్టింది.. కట్ చేస్తే.. పోకిరి లెవల్ ట్విస్ట్ అయ్యా. !!

” సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు ఆయన నిష్పక్షపాతం మరియు విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా ఉండడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు పాలన విధానాలు మరియు రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రజాసేవలో అధికారి విధులను నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఇటువంటి నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఈ సందర్భంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు పూర్తి మద్దతు తెలియజేస్తుంది. సివిల్ సర్వీసు అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతత్వాన్ని కాపాడటానికి తాము అండగా నిలబడతామని సంఘం స్పష్టం చేస్తోంది. కలెక్టర్ విధులను రాజకీయంగా వక్రీకరించే ప్రయత్నాలు, విధి నిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీయడంతో పాటు, పాలన పట్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తాయి. అందువల్ల, ఇటువంటి నిరాధార ఆరోపణలను వెంటనే నిలిపివేయాలని, వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం పిలుపునిస్తోంది” అంటూ మాజీ మంత్రి కేటీఆర్ వాఖ్యలను ఖండించారు.

ఇవి చదవండి: తెలంగాణ సచివాలయంలో వింత ఉత్తర్వులతో అధికారులు షాక్.. 

వీళ్లు కొడుకులు కారు యమకింకరులు.. కన్నతల్లిని స్మశానంలో వదిలేసి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి