Telangana: సచివాలయంలో వింత ఉత్తర్వులతో అధికారులు షాక్.. సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చార్జింగ్‌పై ఆంక్షలు

తెలంగాణ సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు ఊహించని షాక్ తగిలింది. సచివాలయంలో అధికారుల వ్యక్తిగత సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఉపయోగించడంపై పరిమితులు విధించడంతో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అవాక్కయ్యారు.

Telangana: సచివాలయంలో వింత ఉత్తర్వులతో అధికారులు షాక్.. సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చార్జింగ్‌పై ఆంక్షలు
Telangana Secretariat
Follow us
Prabhakar M

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 27, 2024 | 6:00 PM

తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులకు, ఉద్యోగులకు షాక్‌ తగిలింది. సీఎస్‌ శాంతి కుమారి ఇటీవల జారీ చేసిన కొన్ని వినూత్న ఉత్తర్వులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా, సచివాలయంలో అధికారుల వ్యక్తిగత సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఉపయోగించడంపై పరిమితులు విధించడంతో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

విదేశీ పర్యటనలు నిలిపివేయాలని ఆదేశాలు

ఇది మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని ఉన్నతాధికారులు మంత్రులు విదేశీ పర్యటనలను కూడా నిలిపివేయాలని సీఎస్‌ నిర్ణయించారు. రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫీసు ఖర్చులు తగ్గించడం, కొత్త ఫర్నిచర్ కొనుగోలు పై కూడా ఆంక్షలు విధించారు

వాహనాల కొనుగోళ్లపై నిషేధం

ఇదే సమయంలో, ప్రభుత్వ వాహనాల కొనుగోళ్లపై కూడా తాత్కాలిక నిషేధం విధించారు. నూతన వాహనాల కొనుగోళ్లకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలను తిరస్కరించాలని ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇదిలా ఉంటే, అధికారుల వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను కార్యాలయంలో చార్జింగ్‌ చేయడంపై కూడా సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. దీనిని ప్రభుత్వ వనరుల వినియోగం తగ్గించాలని చార్జింగ్‌‌పై కూడా ఉత్తర్వులు ఇచ్చారు.

వింత ఉత్తర్వులపై అధికారుల ఆశ్చర్యం

సీఎస్‌ నిర్ణయాలు ఇప్పుడు సచివాలయంలో చర్చనీయాంశంగా మారాయి. అనేక మంది అధికారులు, ఉద్యోగులు ఈ నిర్ణయాలను అర్ధం చేసుకోలేకపోతున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వినియోగం లేకుండా పనులు ఎలా చేస్తాం? అనే ప్రశ్నతో చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను చార్జింగ్‌పై ఆంక్షలు ఎలా అమలు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ముందుచూపుతో నిర్ణయాలా? అతిశయంగా?

సీఎస్‌ నిర్ణయాలు ప్రభుత్వ ఖర్చు తగ్గించడానికి తీసుకున్నా, ఆఫీసు పనితీరు ప్రభావితమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక పరికరాల ఛార్జింగ్ పై నిషేధం, ఖర్చులు తగ్గించడం వంటి నిర్ణయాలు రాష్ట్ర పాలనలో కొత్త మలుపుగా నిలవనున్నాయా? లేక ఉద్యోగుల అసంతృప్తికి కారణమవుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి