Hyderabad Pubs: హైదరాబాద్ లో గబ్బు రేపుతున్న పబ్ కల్చర్ పై మరోసారి హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పబ్స్ నిర్వహణపై హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేటి (సోమవారం) నుంచి రాత్రి 10 దాటితే పబ్స్ లో ఎటువంటి సౌండ్ ఉండకూడదని హై కోర్టు పేర్కొంది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతినిచ్చింది.
రోజు రోజుకీ హైదరాబాద్ లో పబ్ కల్చర్ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. పలువురు పబ్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా పబ్బులు నడుపుతూ.. యువతను పక్కదారి పట్టిస్తున్నారంటూ గత కొంతకాలంగా ఆందోళల వ్యక్తం చేస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పబ్‌లు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..