Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు… నిందితుల రిమాండ్‌కు హైకోర్టు గ్రీన్​సిగ్నల్

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల రిమాండ్‌కు అనుమతినిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. నిందితులైన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, కోరె నందు కుమార్‌ అలియాస్‌ నందు, సింహయాజిలను.. సైబరాబాద్‌ సీపీ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.

Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు... నిందితుల రిమాండ్‌కు హైకోర్టు గ్రీన్​సిగ్నల్
Telangana High Court
Follow us

|

Updated on: Oct 29, 2022 | 12:46 PM

ఫామ్‌హౌస్‌ కేసులో హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. నిందితుల రిమాండ్‌ను రిజక్ట్‌ చేస్తూ ఏసీబీ కోర్ట్‌ ఇచ్చిన ఆర్డర్‌ను కొట్టివేసింది హైకోర్టు. నిందితులు సైబరాబాద్ సీపీ ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిందితులను తిరిగి 24గంటల్లో ఏసీపీ ప్రత్యేక  కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎప్పుడైనా అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.. అంతేకాకుండా నిందితులను రిమాండ్‌కు ఇవ్వాలని ఏసీబీ కోర్టుకు సూచించింది.

ఇటు ఫాంహౌస్‌ ఎపిసోడ్‌ అంతా ట్రాష్‌ అని.. సీబీఐతోకాని, సుప్రీం సిట్టింగ్‌ జడ్జితో కానీ విచారణ జరిపించాలంటూ బీజేపీ వేసిన పిటిషన్‌ను శనివారం హైకోర్టు విచారించనుంది. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని అందుకే సీబీఐ విచారణ కోరుతున్నామని బీజేపీ నేతలు పిటిషన్‌లో పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికలలో బీజేపీని ఇబ్బంది పెట్టిందుకే అధికార పార్టీ పోలీసులతో కలిసి తమపై అభియోగాలు మోపుతోందని పిటిషన్ లో పేర్కొంది.

పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో ఏముంది…?

ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్‌లో సంచలనాలు బయటకు వస్తున్నాయి. సేకరించిన ఆధారాలతో పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌ రెడీ చేశారు. ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు ప్రలోభాలకు గురిచేసినట్టు పేర్కొన్నారు. ఆధారాల కోసం రహస్య కెమెరాలు, వాయిస్ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు తెలిపారు. హాల్‌లో రహస్య కెమెరాలు, రోహిత్‌రెడ్డి జేబులో 2వాయిస్ రికార్డర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఫాంహౌస్‌లో మ. 3.10కి రహస్య కెమెరాలు ఆన్ చేశామని నివేదికలో స్పష్టం చేశారు. సాయంత్రం 4.10కి గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులు వచ్చారన్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఆ ముగ్గురితో MLAలు చర్చించినట్టు నివేదికలో పేర్కొన్నారు. మీటింగ్‌ అయ్యాక కొబ్బరి నీళ్లు తీసుకు రా అని సిగ్నల్ ఇవ్వాలని రోహిత్‌రెడ్డికి ముందే చెప్పామని, ఆ సిగ్నల్‌ వచ్చిన వెంటనే లోపలికి వెళ్లి…రామచంద్ర, నందు, సింహయాజిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

కర్ణాటక, ఢిల్లీలో ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభాలకు గురిచేశామంటూ రామచంద్రభారతి చెప్పిన మాటల గురించి ప్రస్తావించగా నిందితులు మౌనంగా ఉండిపోయారని పోలీసులు వెల్లడించారు. నిందితుల ఫోన్లతో పాటు నందుకు చెందిన ఓ డైరీని సీజ్‌ చేశారు..ఆ డైరీలో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు చెందిన 50 మంది నేతల వివరాలు ఉన్నాయి. అయితే వాళ్లు ఎవరు? నందుతో వాళ్లకు ఉన్న రిలేషన్‌ ఏంటన్నది ఆరాతీస్తున్నారు పోలీసులు. సేకరించిన ఆడియోలో వాయిస్‌లు ఎవరెవరివి అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్‌కి పంపారు. మహారాష్ట్ర, కర్నాటకలో బీజేపీ ఏం చేసిందో చూసామని.. తెలంగాణలో కూడా అదే చేయాలని ట్రై చేసి అడ్డంగా బుక్కైందన్నారు నటుడు ప్రకాశ్‌రాజ్‌. వాళ్లు మారతారని అనుకోవడం మన భ్రమ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా