Telangana: రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఇకనుంచి స్కూళ్లలో విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ

| Edited By: Aravind B

Jul 12, 2023 | 9:06 PM

గుండె అలసిపోతుంది. అకస్మాత్తుగా ఆగిపోతుంది. జ్వరం, జలుబు వచ్చినంత ఈజీగా గుండెపోట్లు వస్తున్నాయి. వయసుకు సంబంధం లేకుండా మనుషులు కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు ఆడి పాడిన ఆ హృదయం ఒక్కసారిగా ఆగిపోతుంది. కారణాలు ఏవైనా కొంతమందినైనా కాపాడేందుకు పరిష్కారం మాత్రం ఉంది.

Telangana: రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఇకనుంచి స్కూళ్లలో విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ
Cpr
Follow us on

గుండె అలసిపోతుంది. అకస్మాత్తుగా ఆగిపోతుంది. జ్వరం, జలుబు వచ్చినంత ఈజీగా గుండెపోట్లు వస్తున్నాయి. వయసుకు సంబంధం లేకుండా మనుషులు కుప్పకూలిపోతున్నారు. అప్పటివరకు ఆడి పాడిన ఆ హృదయం ఒక్కసారిగా ఆగిపోతుంది. కారణాలు ఏవైనా కొంతమందినైనా కాపాడేందుకు పరిష్కారం మాత్రం ఉంది. అదే సిపిఆర్. కార్డియో పల్మునరీ రీసోసిటేశన్… సీపీఆర్ అని పిలవబడే ఈ ప్రక్రియ కార్డియాక్ అరెస్టు జరిగిన సమయంలో అప్లై చేస్తే సగం మందిని కాపాడే అవకాశం ఉంటుంది. గుండెలో నుంచి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ కావడం వల్ల వచ్చేదే కార్డియాక్ అరెస్ట్. ఆ సమయంలో సిపిఆర్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ పెరిగి బ్లాక్ క్లియర్ అవ్వడం వల్ల మనుషులు బతికే అవకాశం చాలా ఎక్కువ.

కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న మరణాల్లో సగం కంటే ఎక్కువ మరణాలు అందుబాటులో ఉన్నవారికి సిపిఆర్ చేయడం తెలియకపోవడం, దగ్గర్లో ఆసుపత్రులు లేకపోవడం వల్లనే చనిపోతున్నారు. గుండెపోటు వచ్చిన మనిషి పక్కన ఉండేవారిలో ఒక్కరికైనా సీపీఆర్ గురించి అవగాహన ఉంటే ప్రాణాన్ని కాపాడినవాళ్లవుతారు. ఇందుకోసమే తెలంగాణ ప్రభుత్వం త్వరలో స్కూల్లో విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఏదో కొద్ది రోజులు మొక్కుబడిగా కాకుండా… ప్రాథమిక వైద్యం అని సబ్జెక్ట్ పెట్టి పూర్తిస్థాయిలో వారికి వైద్యంపై అవగాహన కలిగించాలని వైద్యశాఖ ఆలోచన. ఇందుకోసం ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో వారానికి రెండు మూడు రోజులు ఒక పీరియడ్ ఇందుకు కేటాయించాలని భావిస్తుంది. కేవలం సీపీఆర్ మాత్రమే కాకుండా… అత్యవసర సమయాల్లో ఎలాంటి జబ్బులకు ఎలాంటి ఇమీడియట్ ట్రీట్మెంట్ ద్వారా ప్రాణాలు కాపాడుకునే విషయాన్ని చెప్పనున్నారు.

ఉదాహరణకు ఎవరైనా ఆక్సిడెంట్ జరిగి రోడ్డు పక్కన ఉంటే వారికి ఎలాంటి సహాయం అందించాలి. కాలు లేదా చేయు విరిగితే రక్తం పోకుండా ఎలా ఆపాలి. ఇంట్లో ఎవరికైనా వచ్చే అవసరం వైద్య సహాయం అవసరమైతే ఎవరికి ఫోన్ చేయాలి? ఇలాంటివన్నీ పాఠాలుగా అందించనుంది తెలంగాణ విద్యాశాఖ. నిజానికి కేవలం విద్యార్థులకు కాదు ప్రతి పౌరునికి ఇవన్నీ అవసరం. దీంతో తమ ప్రాణాల్ని కాదు పక్క వారి ప్రాణాన్ని కూడా రక్షించుకునే అవకాశం అవగాహన ఏర్పడుతుంది. స్కూళ్లలోనే కాదు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, రవాణా వ్యవస్థల్లో, పబ్లిక్ ప్లేసెస్ లో దీని గురించి అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి

( రాకేశ్, చీఫ్ రిపోర్టర్, టీవీ9 )

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..