AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Bhavan: రాజ్‎భవన్‎లో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. ఢిల్లీ పర్యటనపై గవర్నర్ స్పష్టత..

తెలంగాణ రాజ్‎భవన్‎లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గవర్నర్ తమిళసై రాజ్‎భవన్ ఉద్యోగులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు వేసి, చెరుకు గడలను ఏర్పాటు చేసి అందులో పొంగల్ తయారు చేశారు. రకరకాల పూలతో ఇంటిని అందంగా అలంకరించారు.

Raj Bhavan: రాజ్‎భవన్‎లో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. ఢిల్లీ పర్యటనపై గవర్నర్ స్పష్టత..
Telangana Governor Tamilisai
Srikar T
|

Updated on: Jan 13, 2024 | 1:44 PM

Share

తెలంగాణ రాజ్‎భవన్‎లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గవర్నర్ తమిళసై రాజ్‎భవన్ ఉద్యోగులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు వేసి, చెరుకు గడలను ఏర్పాటు చేసి అందులో పొంగల్ తయారు చేశారు. రకరకాల పూలతో ఇంటిని అందంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసిననంతరం తెలంగాణ ప్రజలకు సంక్రాంతి, పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కాంక్షించారు. ఈ సారి సంక్రాంతి వేడుకలు పూర్తైన వారం రోజులకు అయోధ్యలోని శ్రీరాముని మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందన్నారు. అందుకే ఈ ఏడాది సంక్రాంతి ప్రత్యేకం అన్నారు. త్వరలో రామ్ మందిర్‎కి సంబంధించిన తెలుగు, హిందీ పాటలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా తన ఢిల్లీ పర్యటన గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ వెళ్తున్నానన్నారు. ఇది రాజకీయ పరమైన పర్యటన కాదని స్పష్టం చేశారు. దీనికి కారణం గతంలో ఆమె ఢిల్లీ పర్యటించినప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా తమిళనాడు నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ తమిళి సై కొట్టిపరేశారు. అవన్నీ ఉత్తి వదంతులే అని వివరించారు. అలాంటివి ఏవైనా ఉంటే ముందుగానే తెలియజేస్తానన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..