Nayanthara: ‘క్షమాపణలు చెబితే సరిపోదు’.. నయనతార ‘అన్నపూర్ణి’ పై ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు.. వీడియో

కొత్త ఏడాదిలో నయనతారకు ఏదీ కలిసి రావడం లేదు. ఆమె నటించిన అన్నపూర్ణి సినిమా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటోంది. థియేటర్లలో రిలీజైనప్పటి నుంచి ఈ మూవీపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అన్నపూర్ణి ఎప్పుడైతే ఓటీటీలో రిలీజ్‌ అయ్యిందో వివాదాలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో అన్నపూర్ణి సినిమాతో పాటు నయనతారపై కూడా కేసులు నమోదయ్యాయి

Nayanthara: 'క్షమాపణలు చెబితే సరిపోదు'.. నయనతార 'అన్నపూర్ణి' పై ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు.. వీడియో
Mla Raja Singh, Nayanthara
Follow us
Basha Shek

|

Updated on: Jan 13, 2024 | 8:34 AM

కొత్త ఏడాదిలో నయనతారకు ఏదీ కలిసి రావడం లేదు. ఆమె నటించిన అన్నపూర్ణి సినిమా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటోంది. థియేటర్లలో రిలీజైనప్పటి నుంచి ఈ మూవీపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అన్నపూర్ణి ఎప్పుడైతే ఓటీటీలో రిలీజ్‌ అయ్యిందో వివాదాలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో అన్నపూర్ణి సినిమాతో పాటు నయనతారపై కూడా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సైతం నయనతార సినిమాను స్ట్రీమింగ్‌ నుంచి తొలగించింది. తాజాగా నయన తార సినిమాపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నపూర్ణి సినిమాను నిర్మించిన జీ స్టూడియోస్‌ను పూర్తిగా నిషేధం విధించాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. గతంలో కూడా ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయని.. భవిష్యత్‌లో మరెవరూ ఇలాంటి చిత్రాలు తీయకుండా దర్శక నిర్మాతలు, నటీనటులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌కు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్‌ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. ‘జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పిందని విన్నాను. అయితే క్షమాపణలు చెప్పినా ఇలాంటివీ జరుగుతూనే ఉంటాయి. గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి సినిమాలు రావడం మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఈ వివాదానికి కారణమైన జీ స్టూడియోస్‌ను పూర్తిగా నిషేధించాలి. ఇలాంటి సినిమాలు తీసే దర్శక నిర్మాతలు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని వీడియోలో కోరారు ఎమ్మెల్యే రాజా సింగ్‌.

ప్రస్తుతం రాజాసింగ్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా డిసెంబర్‌ 1న థియేటర్లలో విడుదలైన అన్నపూర్ణి సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అదే సమయంలో వివాదాలను మూటగట్టుకుంది. సినిమాలో హిందువులను కించ పరిచే సన్నివేశాలున్నాయంటూ, లవ్ జిహాదీని ప్రోత్సహించేలా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు రోడ్డెక్కాయి. ఇక ఓటీటీలో రిలీజైన తర్వాత అన్నపూర్ణి వివాదం తారాస్థాయికి చేరుకుంది. అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించేవరకు నయనతార సినిమాను స్ట్రీమింగ్‌ నుంచి తీసివేస్తామని ప్రకటించింది. అన్నపూర్ణి సినిమాలో జై, కార్తీక్‌ కుమార్, సత్యరాజ్‌, పూర్ణిమ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలివే.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!