Guvvala Balaraju: రాజీనామా చేసి పోటీ చేద్దాం.. ఎంపీ రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సవాల్

ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిస్తే.. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆత్మగౌరవ సభ పెడతామని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు. రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.

Guvvala Balaraju: రాజీనామా చేసి పోటీ చేద్దాం.. ఎంపీ రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సవాల్
Guvvala Balaraju
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 25, 2021 | 5:49 PM

Guvvala Balaraju fires on Revanth Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిస్తే.. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆత్మగౌరవ సభ పెడతామని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తెలిపారు. రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. ముందుగా హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ తెచ్చుకోవాలని ఆయన సవాల్ విసిరారు. రేవంత్‌కి దమ్ముంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేసి గెలవాలని గువ్వల సవాల్ చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గువ్వల పేర్కొన్నారు. దళిత బంధు, రైతు బంధు, భీమా , పింఛన్లు అమలు పై ప్రజలను అడిగి ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు.

ఇవాళ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పర్యటనలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజు ఎంపీ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆత్మగౌరవం ఎక్కడ ఉంది.. దళితుల పట్ల నిజంగా ప్రేమ ఉందా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ పై అవాకులు చవాకులు మాట్లాడటం మానుకోవాలని గువ్వల బాలరాజు హితవు పలికారు. పీసీసీ పదవి రాగానే సీఎం లాగా ఫీల్ అవుతున్నావ్.. గజ్వెల్‌లో నిన్ను ఎవరు పట్టించుకోరన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తీరు పట్ల, ఇప్పుడు దళిత బంధు పథకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. దేశంలో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు.

మల్కాజిగిరి ఎంపీ అయ్యాక రేవంత్ రెడ్డి.. వ్యాపారులను బెదిరించిన చిట్టా తమ వద్ద ఉందన్న గువ్వల.. త్వరలోనే ఆయన బండారం బయటపెడతామన్నారు.హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉందా అని ప్రశ్నించిన ఆయన.. బరిలోకి దిగితే డిపాజిట్ కూడా దక్కదని జోస్యం చెప్పారు.హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ని నిలబెట్టడానికి వణుకుతున్న రేవంత్ గజ్వేల్‌లో జెండా ఎలా పాతుతావన్నారు. హుజురాబాద్‌లో నిజమైన యుద్ధం జరుగుతోంది. ప్రతిపక్షాలు ఎన్ని అవాకులు, చవాకులు మాట్లాడిన టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.సీఎం కేసీఆర్ రాష్ట్రం మొత్తాన్ని దత్తత తీసుకున్నారని.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు.

Read Also…  Vijayashanthi: ఎన్నికల కోసమే ప్రజలకు తాయిలాలు.. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయంః విజయశాంతి

Afghan crisis: మోకాలి లోతు డ్రైనేజీ నీటిలో నిలబడి.. తమను రక్షించాలంటూ కాబూల్ విమానాశ్రయం వద్ద ఆఫ్ఘన్ల దీనాలాపనలు