తెలంగాణ కొత్త సచివాలయ నమూనా విడుదల..

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రాష్ట్ర సచివాలయం నమూనా ఖరారైంది. ఈ మేరకు తాజాగా నూతన సెక్రటరీ నమూనా చిత్రాన్ని సీఎం కార్యాలయం విడుదల చేసింది. ఎప్పటి నుంచో ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించాలని...

తెలంగాణ కొత్త సచివాలయ నమూనా విడుదల..
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2020 | 11:12 AM

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న రాష్ట్ర సచివాలయ నమూనా ఖరారైంది. ఈ మేరకు తాజాగా నూతన సెక్రటేరియట్ నమూనా చిత్రాన్ని సీఎం కార్యాలయం విడుదల చేసింది. ఎప్పటి నుంచో ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి, కొత్తది నిర్మించాలని నిర్ణయించింది. కానీ న్యాయపరమైన అడ్డంకులు రావడంతో.. న్యూ సెక్రటేరియట్ ఏర్పాటుకు సమయం పట్టింది. కానీ ఇటీవల తెలంగాణ హైకోర్టు సచివాలయ భవనాల కూల్చివేతకు అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెల్లవారుజాము నుంచే సచివాలయ భవనాల కూల్చివేత పనులను మొదలు పెట్టింది తెలంగాణ సర్కార్. ఇక ఆ వెంటే కొత్త సెక్రటేరియట్ నమూనాను విడుదల చేసింది.

Read More:

మాజీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కన్నుమూత

గోల్డ్ కొనాలనుకునే వారికి ఆర్బీఐ బంపర్ ఆఫర్..