AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS2BHK: గ్రేటర్ వాసులకు గుడ్ న్యూస్.. మరో వారంలో తొలి విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ..

తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసిలో లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తుందని, ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందని  పురపాలక శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. ఇందులో సుమారు 4500 కు పైగా ఇండ్లను ఇన్ సిట్యూ లబ్ధిదారులకు అందించామని  తెలిపారు.  నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సూమారు 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందిస్తామని ఈ సందర్భంగా..

TS2BHK: గ్రేటర్ వాసులకు గుడ్ న్యూస్.. మరో వారంలో తొలి విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ..
Double Bedroom Housing Scheme
Vidyasagar Gunti
| Edited By: Shiva Prajapati|

Updated on: Aug 16, 2023 | 12:46 PM

Share

Double Bedroom Housing scheme: జిహెచ్ఎంసి నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియపైన పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఈరోజు ప్రగతి భవన్ లో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో పంపిణీ ప్రక్రియను జిహెచ్ఎంసి మరింత వేగవంతం చేసింది. జిహెచ్ఎంసి పరిధిలోని నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి , డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ లు హాజరైన ఈ సమావేశానికి  జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే 70వేల ఇండ్లు నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని అధికారులు ఈ సమీక్ష సమావేశంలో మంత్రులకు తెలియజేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసిలో లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తుందని, ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి అయిందని  పురపాలక శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. ఇందులో సుమారు 4500 కు పైగా ఇండ్లను ఇన్ సిట్యూ లబ్ధిదారులకు అందించామని  తెలిపారు.  నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సూమారు 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే వారంలోనే తొలి దశ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందదన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని జిహెచ్ఎంసి అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రక్రియ పంపిణీ పైన మంత్రులు పలు సూచనలను తెలియజేశారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించి నగర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తిచేసి అర్హులను గుర్తిస్తున్నదని మంత్రులు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరినీ వాటి కేటాయించనున్న ఇండ్ల వద్దనే అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని ఈ సందర్భంగా మంత్రులు సూచించారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే విషయాన్ని కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..