Telangana: మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు

లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో చదవండి.

Telangana: మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు
Telangana Liquor Shops
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 07, 2021 | 7:36 PM

లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ల ప్రకారం షాపులు కేటాయించేందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించింది. కొత్త జిల్లాలను యూనిట్‌గా తీసుకొని కేటాయింపులు చేసేందుకు కలెక్టర్లకు పవర్స్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో ఉన్న షాపులు ఆధారంగా ఈ కేటాయింపులు పూర్తి చేస్తారు. ఈ కేటాయింపుల కోసం కలెక్టర్‌ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా.. జిల్లా ఎక్సైజ్‌ అధికారి, గిరిజన అభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమ అధికారి, ఎస్సీ అభివృద్ధి అధికారి ఉంటారు. డ్రా ద్వారా లిక్కర్ షాపుల కేటాయింపు జరగనుంది. ఈ కేటాయింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో షూట్ చేయటం తప్పనిసరి చేస్తూ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది.

నూతన పాలసీ ప్రకారం లిక్కర్ షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లను తెలంగాణ సర్కార్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. గౌడ్​లకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం షాపులు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన లాటరీ ద్వారా షాపుల కేటాయింపులు చేయనున్నట్లు పేర్కొంది. దరఖాస్తు రుసుము గతంలో మాదిరిగానే రూ.2 లక్షలుగా సర్కార్ నిర్ణయించింది. షాపుల కేటాయింపుల్లో పాత స్లాబులే కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వివరించింది. లైసెన్స్‌లు పొందిన వారు సంవత్సరానికి ఒకసారి నిర్దేశించిన లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

5 వేల జనాభా వరకు 50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉంటే 60 లక్షలు లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లక్ష నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షలు వరకు జనాభా ఉంటే రూ.85 లక్షలు, 20 లక్షలకు మించి జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు కోటి పది లక్షలుగా ఫిక్స్ చేశారు.

Also Read: CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రెస్‌మీట్ లైవ్ చూడండి

 తెలంగాణలో బస్సు ఛార్జీల పెంపు కన్ఫామ్.. తేల్చి చెప్పిన ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?