TSRTC: తెలంగాణలో బస్సు ఛార్జీల పెంపు కన్ఫామ్.. తేల్చి చెప్పిన ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల బాదుడు కన్ఫామైంది. అతిత్వరలోనే ఆర్టీసీ ఛార్జెస్ పెరగనున్నాయ్. అయితే, అది ఎంతన్నదే క్లారిటీ లేదు.
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల బాదుడు కన్ఫామైంది. అతిత్వరలోనే ఆర్టీసీ ఛార్జెస్ పెరగనున్నాయ్. అయితే, అది ఎంతన్నదే క్లారిటీ లేదు. ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పదని మరోసారి తేల్చిచెప్పేసిన ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్… ప్రజలపై భారం మాత్రం ఉండదంటూ సంకేతాలు ఇచ్చారు. కొంచెం లాభం-కొంచెం కష్టం ఫార్ములాతో ఆర్టీసీ ఛార్జీలను పెంచబోతున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంకేతాలు ఇచ్చారు. డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినందున ఏకపక్షంగా ఛార్జీల పెంపు ఉండబోదన్నారు. ఆర్టీసీ ఛార్జెస్ హైక్‌పై మంత్రి పువ్వాడ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఛార్జీల పెంపుపై మరోసారి ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయ్.
ఆర్టీసీ ఛార్జీలు పెంచాలంటూ గతంలోనే ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపారు. అయితే, కేంద్రం డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో ప్రపోజల్స్‌లో మార్పులు చేశారు. సామాన్య ప్రజలపై భావరం పడకుండా పల్లె వెలుగు ఛార్జీలపై పెంపును కొంచెం తగ్గించారు. మిగతా అన్ని సర్వీసులపైనా ఛార్జీలు మోస్తరుగా పెరగనున్నాయ్.
Also Read: ‘జై భీమ్’ సినిమాలో సినతల్లి పాత్ర పోషించింది ఈమె అంటే నమ్ముతారా..? ఆసక్తికర విషయాలు
పోలీసులకు కొత్త పవర్స్ ఇవ్వనున్న ప్రభుత్వం.. ఇకపై ఆ బాధ్యతలు వారికే.. !