AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Private Teachers Telangana: రేషన్‌ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Free Rice For Private Teachers In Telangana: కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో జీతం లేక ప్రైవేటు టీచర్లు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారి కోసమే.. 25 కిలోల సన్న బియ్యంతోపాటు, రూ. 2 వేల నగదు సాయంగా అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం...

Private Teachers Telangana: రేషన్‌ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Free Rice in Telangana
Narender Vaitla
|

Updated on: Apr 13, 2021 | 3:23 PM

Share

Free Rice For Private Teachers In Telangana: కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో జీతం లేక ప్రైవేటు టీచర్లు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారి కోసమే.. 25 కిలోల సన్న బియ్యంతోపాటు, రూ. 2 వేల నగదు సాయంగా అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం దరఖాస్తు చేసుకునే సమయంలో రేషన్‌కార్డు/ఆహార భద్రతా కార్డు నెంబర్‌ నమోదు చేయాలనే నిబంధన ఉంది. కానీ ప్రైవేటు టీచర్లలో రేషన్‌ కార్డు లేని వారు చాలా మంది ఉన్నారు. దీంతో వీరంతా గందరగోళానికి గురై అధికారులను సంప్రదించారు. దీంతో ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందిస్తూ.. రేషన్‌ కార్డు లేకపోయినా 25 కిలోల బియ్యం అందజేయాలని ఆదేశాలిచ్చారు. తమకు సమీపంలో ఉన్న రేషన్‌షాపు నంబర్‌ను దరఖాస్తుల్లో పేర్కొనాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం అందిస్తోన్న ఈ సాయం కోసం మూడురోజుల్లోనే 1.25 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు. సోమవారం ఒక్కరోజే 65 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకోవడానికి మరో మూడు రోజులు గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 21 నుంచి ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బందికి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలోనే టీచర్లు, సిబ్బందికి పంపిణీ చేసేందుకు సన్నబియ్యం సిద్ధంచేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేశారు. ఇక కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో హీరో మంచి విష్ణు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం ఎంతో గొప్పదని, ముఖ్యమంత్రి నిర్ణయంతో ఉపాధ్యాయులు, సిబ్బంది ఎంతగానో సంతోషిస్తున్నారని ఆయన సోమవారం ట్వీట్‌చేశారు.

Also Read: CM KCR Sagar Meeting: హాలియాలో సీఎం కేసీఆర్ సభకు తొలగిన అడ్డంకి.. పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

Ugadi: ఈ ఏడాది ఓ పెద్దనేతకు ఇబ్బందికర పరిస్థితులు.. విశాఖ శ్రీ శారదాపీఠం ఉగాది వేడుకల్లో స్వరూపానందేంద్ర స్వామి

Low-Cost House: తక్కువ ఖర్చుతో 15 రోజుల్లో మైక్రో ఇల్లు రూపకల్పన చేసిన అమ్మాయిపై కవిత ప్రశంసల వర్షం

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..