Telangana: ఇవాళ్టి నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగులు.. జీవో కాపీని వీఆర్ఏలకు అందచేసిన సీఎం కేసీఆర్
చెప్పిన మాట ప్రకారం జీవీను జారీ చేసింది. తాతల తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్ఏలకు పే స్కేలు అమలు పరుస్తూ, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ఆదివారం నాడు ఇచ్చిన మాట ప్రకారం..

హైదరాబాద్, జూలై 24: ఇచ్చిన మాట నిలుపుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆదివారం నాడు చెప్పిన మాట ప్రకారం జీవీను జారీ చేసింది. తాతల తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్ఏలకు పే స్కేలు అమలు పరుస్తూ, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ఆదివారం నాడు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) సోమవారం నాడు సచివాలయంలో జీవో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు.
సీఎం కేసీఆర్‌తో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు సచివాలయంలో సమావేశం అయ్యారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జారీ చేసిన జీవో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు ముఖ్యమంత్రి స్వయంగా అందించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంపై వీఆర్ఏ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న వీఆర్ఏలను నాలుగు ప్రభుత్వ శాఖల్లో సర్ధుబాటు చేయాలని తెలంగాణ సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
20,555 మంది గ్రామ రెవెన్యూ సహాయకులను ( వీఆర్‌ఏ ) క్రమబద్ధీకరించి వారి విద్యార్హత ఆధారంగా వివిధ శాఖల్లో నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించించారు. 2020లో VRA వ్యవస్థ రద్దు చేసిన విషయం తెలిసిందే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
