Ration Cards: రేషన్‌ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్.. మీసేవ కేంద్రాల్లో ఆ అవకాశం..

చాలా రోజుల నుంచి రేషన్‌ కార్డులో మార్పులకు సంబంధించి ఎలాంటి అవకాశం కల్పించారు. దీంతో వివాహాలు అయిన వారు, ఏవైనా మార్పులు చేర్పులు చేర్పులు చేసుకోవాలనుకున్న వారు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తాజగా రేషన్‌ కార్డుల్లో ఎడిట్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రేషన్‌ కార్డుల్లో మార్పులు చేసుకునే వీలు ఉంది....

Ration Cards: రేషన్‌ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్.. మీసేవ కేంద్రాల్లో ఆ అవకాశం..
Ration Card
Follow us

|

Updated on: Jul 07, 2024 | 2:53 PM

తెలంగాణలో రేషన్‌ కార్డులకు సంబంధించి అధికారులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్‌ కార్డుల జారీకి త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సమయంలోనే రేషన్‌ కార్డులకు సంబంధించి అధికారులు ఓ కీలక ప్రకటన చేశారు.

చాలా రోజుల నుంచి రేషన్‌ కార్డులో మార్పులకు సంబంధించి ఎలాంటి అవకాశం కల్పించారు. దీంతో వివాహాలు అయిన వారు, ఏవైనా మార్పులు చేర్పులు చేర్పులు చేసుకోవాలనుకున్న వారు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే తాజగా రేషన్‌ కార్డుల్లో ఎడిట్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రేషన్‌ కార్డుల్లో మార్పులు చేసుకునే వీలు ఉంది. శనివారం నుంచి మీసేవా కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చింది.

రేషన్‌ కార్డుల్లో తప్పులు సరిచేయడానికి, కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేయడానికి.. వివాహం అయిన వారికి అత్తవారింటి రేషన్‌కార్డులో పేరు యాడ్‌ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. రేషన్‌ కార్డులో సవవరణాలు చేయడానికి కుటుంబ సభ్యుల అందరి ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డు జిరాక్స్‌ తీసుకొని మీ సేవ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అయితే ఇది కొత్త రేషన్‌ కార్డు కోసం కాదు. రేషన్‌ కార్డుపై ఒకపేరు, ఆధార్‌లో మరో పేరు ఉన్నవారు సైతం మార్పులు చేసుకోవచ్చు. ఇక దీనికి చివరి తేదీ ఎప్పుడన్నదానిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి సంబంధించి త్వరలోనే ప్రక్రియ ప్రారంభిచంనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో దీనిపై ఓ స్పష్టత రానుందని సమాచారం. ఇదిలా ఉంటే పాత రేషన్‌ కార్డుల స్థానంలో కొత్తవి రానున్నాయని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల కోసం అవకాశం ఇస్తే… మరో 10 లక్షలు కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..