Telangana Floods: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు పోటెత్తిన వరదనీరు.. 26 గేట్లు ఎత్తిన ఇర్రిగేషన్ అధికారులు – Watch Video

Telangana Floods: తెలంగాణలో నాన్ స్టాప్ రెయిన్స్ దంచిగొడుతున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు వరదనీరు పోటెత్తుతోంది. అటు నిజామాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు.. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. అనేక చెరువులు అలుగు పోస్తున్నాయి.

Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 27, 2023 | 4:35 PM

Sriram Sagar Project: తెలంగాణలో నాన్ స్టాప్ రెయిన్స్ దంచిగొడుతున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు వరదనీరు పోటెత్తుతోంది. అటు నిజామాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు.. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. అనేక చెరువులు అలుగు పోస్తున్నాయి. దీనికి తోడు వరద ఉధృతి ఉధృతంగా కొనసాగుతుండడంతో.. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తోంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 2లక్షల 22వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో.. 26 గేట్లను ఎత్తారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 90 అడుగులకు వరద చేరువు అవుతుండడంతో.. వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు.

శ్రీరాంసాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు. కామారెడ్డి జిల్లాలో ఉన్న నిజాం సాగర్‌, జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌ నాలా ప్రాజెక్టులోకి కూడా వరద పోటెత్తుతోంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ సింగూరు నుంచి వరద భారీగా వస్తుండడంతో దాదాపుగా నిండిపోయింది. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, మండలాల్లో చెరువులు, కుంటలు నిండిపోయాయి. పలు గ్రామాల వాగులు పొంగడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, అంతేగాక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో కామారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు రైతులు వ్యవసాయ పనులకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉండే పరిస్థితి నెలకొంది. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు నీట మునిగాయి. మక్క, సోయా, పత్తి పంటలపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉపొంగి ప్రవహిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!