AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana – Minister Harish Rao: తెలంగాణపై మోదీ కామెంట్స్.. తీవ్రంగా స్పందించిన మంత్రి హరీష్ రావు..

Minister Harish Rao: తెలంగాణ(Telangana) ఎదుగుతుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర ఆర్థిక..

Telangana - Minister Harish Rao: తెలంగాణపై మోదీ కామెంట్స్.. తీవ్రంగా స్పందించిన మంత్రి హరీష్ రావు..
Telangana Minister Harish Rao
Shiva Prajapati
|

Updated on: Feb 08, 2022 | 3:48 PM

Share

Minister Harish Rao: తెలంగాణ(Telangana) ఎదుగుతుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. మంగళవారం నాడు సిద్దిపేట(Siddipet) జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మంత్రి హరీష్. తొలుత అక్కన్నపేట మండలం పోతారంలో దళిత బంధు కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. పార్లమెంట్‌లో తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించారు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ప్రధాని మోడీకి నచ్చట్లేదని విమర్శించారు. ముఖ్యంగా తెలంగాణపై ఆయన అక్కసు ఇంకా పెరుగుతోందన్నారు. భద్రాచలంలోని ఏడు మండలాలను పవర్ ప్లాంట్‌ను ఆంధ్రాలో కలిపింది మోదీనే అని దుయ్యబట్టారు.

‘‘ఇవాళ తెలంగాణ ఏర్పాటుపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.. నాటీ బీజేపీ ప్రభుత్వం 2004 లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇన్ని బలిదానాలు జరిగి ఉండేవా?’’ అని ప్రశ్నించారు. వందలాది ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్, బీజేపీ లే కారణం అని నిప్పులు చెరిగారు. బీజేపీ నాయకులు ఎరువుల ధరలను పెంచడమే కాకుండా.. వ్యవసాయ బావుల వద్ద కరెంటు మీటర్లను బిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ గొంతులో ప్రాణం ఉండగా వ్యవసాయ బావుల వద్ద కరెంట్ మీటర్ లను బిగించనియమన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి వివక్ష ప్రదర్శించారని విమర్శించారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించకపోవడం వివక్షకు నిదర్శనం అన్నారు. ఇప్పటివరకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అని పేర్కొన్నారు.

ఇక దళితులు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారని హరీష్ రావు పేర్కొన్నారు. దళితులు ఆగమాగం కాకుండా మంచి యూనిట్‌ను ఎంచుకుని ముందుకు సాగాలని సూచించారు హరీష్ రావు. ఆ తరువాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ నూతన కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు మంత్రి హరిష్ రావు. అనంతరం పక్కనే ఉన్న మైదానంలో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్‌లో మంత్రి పాల్గొన్నారు. ఆ తరువాత వైద్య విధాన పరిషత్‌లో కలవనున్న హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారులతో కలిసి రివ్యూ సమావేశం నిర్వహించారు.

Also read:

Rajinikanth: సూపర్ స్టార్ 170 కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు స్టార్ దర్శకులు..

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు అలర్ట్‌.. మీ అకౌంట్‌కు నామినీ పేరు చేర్చలేదా..? రూ.7 లక్షలు కోల్పోయినట్టే..!

TS RTC: మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టీవీ9తో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పెషల్ ఇంటర్వ్యూ..